అమరావతి నిర్మాణం కోసం ఆ 30 మందికి పిలుపు...!!

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. వచ్చే రెండు నెలల కాలంలో పనుల ప్రారంభానికి టెండర్లు పిలవాలని నిర్ణయించారు. అటు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ అమరావతికి రూ 15 వేల కోట్ల రుణంకు ఆమోదించింది. ముందుగా మధ్యలో నిలిచిన నిర్మాణాల పూర్తి పైన సీఆర్డీఏ ఫోకస్ చేసింది. ఇదే సమయంలో సీఆర్డీఏ అమరావతి పనుల కోసం ప్రత్యేకంగా 30 మంది కన్సల్టెంట్లను నియమించుకునేందుకు సిద్దమైంది.

కన్సెల్టెంట్లు
అమరావతి నిర్మాణ పనుల కు సంబంధించి కార్యాచరణ సిద్దం అవుతోంది. టెండర్లు పిలిచేలా కసరత్తు మొదలైంది. ఇందుకు సంబంధించిన పనులు సీఆర్డీఏ ప్రారంభించింది. అసంపూర్తిగా నిర్మాణాలు జరిగిన వాటిని ముందుగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం టెండర్లను వచ్చే నెల పిలవనున్నారు. ఇక, ప్రపంచ బ్యాంకు.. ఏడీబీ నుంచి వచ్చే రూ 15 వేల కోట్ల రుణం తో చేపట్టే పనుల గురించి ఇప్పటికే సీఆర్డీఏ ప్రాజెక్టు రిపోర్టు సమర్పించింది. ఆ పనుల ఖరారు కోసం కన్సెల్టీల నియామకం చేసుకోవాలనే సూచనలు అందాయి.

CRDA Decided to utilise 30 consultants services for Amaravati Construction

కసరత్తు
దీంతో, అమరావతి పరిధిలో సీఆర్డీఏ చేపట్టే వేర్వేరు పనుల కోసం మొత్తంగా 30 మంది కన్సెల్టీల కోసం సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించనుంది. ఖరారైన కన్సెల్టెన్సీ సంస్థ ఇచ్చే డీపీఆర్ ఆధారంగా పనులు ముందుకు వెళ్లనున్నాయి. ఈ కన్సెల్టెన్సీల నియామకం పైన ఇప్పటికే సీఆర్డీఏ కసరత్తు పూర్తి చేసింది. నిర్మాణాలకు టెండర్లు పిలవటానికి ముందే ఈ కన్సెల్టెన్సీల నియామక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇందు కోసం ఎంత మేర ఖర్చు చేయాల్సి ఉంటుందనేది ఒక అంచనాకు వచ్చారు.

నియామకాలు
ఈ కన్సెల్టెంట్ల నియామక ప్రక్రియకు సంబంధించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి సీఆర్డీఏ సమర్పించనుంది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే వీరి నియామక ప్రక్రియ కోసం టెండర్లను పిలవనుంది. ఇప్పటికే ఒకటి రెండు సంస్థలను ఆమోదించారు. గతంలో ఇక్కడే పనులు చేపట్టిన ఆర్‌వి అసోసియేట్స్‌, కెఎంసి ప్రాజెక్టు వంటి వాటి నియామకాలు పూర్తయ్యాయి. అదే విధంగా కావాల్సిన స్థాయిలో మిగిలిన కన్సెల్టెంట్ల నియామకాలను పూర్తి చేయాలని.. ఆ వెంటనే నిర్మాణాల టెండర్లను పిలవాలనే విధంగా సీఆర్డీఏ కసరత్తు వేగవంతం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+