Ambati Rayudu:వచ్చేస్తున్నా..ప్రజానాడి అటువైపే..!
మాజీ క్రికెటర్ పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు నిర్ణయించారు. కొంత కాలంగా అంబటి రాయుడు రాజకీయ ఎంట్రీ పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దీని పైన ఇప్పుడు రాయుడు క్లారిటీ ఇచ్చారు. తాను త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ప్రకటించారు. ప్రజా సేవకు వెళ్లే ముందు జనం నాడి తెలుసుకుంటున్నానని వివరించారు. అందు కోసమే పర్యటనలు చేస్తున్నానని చెప్పారు. ఒక పొలిటికల్ గ్రౌండ్ లో అంబటి రాయుడు తన కెరీర్ ప్రారంభించనున్నారు.
రాయుడు పొలిటికల్ సీజన్:ఐపీఎల్ హీరో అంబటి రాయుడు రాజకీయ రంగ ప్రవేశానికి నిర్ణయించారు. ఈ మేరకు రాయుడు క్లారిటీ ఇచ్చారు. త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ప్రకటించారు. గ్రామీణుల సమస్యలు..అవసరాలు తెలుసుకొని వాటిలో ఏ పనులు చేయగలను..ఏ అవసరాలు తీర్చగలను అనే అంశాల పైన నిర్ణయానికి వచ్చిన తరువాత రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. ముందుగా ప్రజానాడి తెలుసుకొనేందుకు గ్రామాల్లో పర్యటనలు చేస్తున్నట్లు వివరించారు. అంబటి రాయుడు వైసీపీల చేరటం ఖాయమని ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు అంబటి రాయుడు సైతం తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు స్పష్టంగా వెల్లడించారు.

వైసీపీ నుంచి పోటీకి సిద్దమేనా:క్రికెట్ లో రాయుడు ఒక సంచలనంగా నిలిచారు. హైదరాబాద్ , ఆంధ్ర టీంలకు ప్రాతినిధ్యం వహించిన రాయుడు అనేక వివాదాల్లో నిలిచారు. ఇండియన్ టీంలోనూ ఆడారు. ప్రపంచ కప్ కు సెలెక్ట్ చేయకపోవటం వెనుక రాయుడు వెల్లడించిన కారణాలు దుమారం రేపాయి.
ఎమ్మెస్కే ప్రసాద్ లక్ష్యంగా ఆరోపణలు చేసారు. ఆ తరువాత ఎమ్మెస్కే సెలక్షన్ కమిటీలో ఏం జరిగిందీ.. అంబటి రాయుడు ఎంపిక పైనా క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో రాజకీయంగానూ అంబటి రాయుడు తన అభిప్రాయాలను వెల్లడించారు. ఎక్కడో ఒక ఐటీ బిల్డింగ్ కడితే అదే అభివృద్ధి కాదని పరోక్షంగా టీడీపీ చేసుకొనే ప్రచారానికి కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ నిర్ణయాలకు మద్దతుగా ట్వీట్లు చేసారు.

తేల్చేసిన అంబటి రాయుడు:ఈ మధ్య కాలంలో పలు సందర్భాల్లో అంబటి రాయుడు సీఎం జగన్ ను కలిసారు. ఐపీఎల్ ఫైనల్ లో సీఎస్కే గెలిచిన తరువాత జట్టు యాజమాన్యంతో కలిసి సీఎం జగన్ వద్దకు వచ్చారు. సీఎం నిర్ణయాలను పలు సందర్భాల్లో ప్రశంసించారు.
దీంతో అంబటి రాయుడు గుంటూరు లేదా మచిలీపట్నం ఎంపీగా బరిలో ఉంటారంటూ ప్రచారం సాగింది. కానీ, తాను సీఎం జగన్ తో రాజకీయ అంశాలు చర్చించలేదని తాజాగా అంబటి రాయుడు స్పష్టం చేసారు. తాను ప్రజలకు ఏం చేయగలనో నిర్ణయించుకున్న తరువాతనే రాజకీయంగా ఎంట్రీ ఇస్తానని చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో వస్తున్నట్లు రాయుడు ప్రకటించారు.












Click it and Unblock the Notifications