వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నారాజు' పడ్డ అభిమానులు: పవన్ 'దేశ్ బచావో' ఆల్బంపై విమర్శలు

ప్రజా చైతన్యాన్ని రగిలించడానికి.. ఓ ధిక్కార స్వరం వినిపించడానికి 'పాట' ఎంతటి క్రియాశీలక పాత్ర పోషిస్తుందో.. తెలంగాణ ఉద్యమం ద్వారా తెలుగు ప్రజలందరికీ అనుభవంలోకి వచ్చే ఉంటుంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఒక ఆకాంక్షను భుజానికెత్తుకున్నవాడు దాన్నో పద్దతి ప్రకారం నిర్మించుకుంటూ వెళ్లాలి. బలమైన సాంస్కృతిక-సాహిత్య పునాదుల మీద ఉద్యమాన్ని నిర్మించాలి. కార్యాచరణకు సమాయత్తమయ్యే ముందు ప్రజా చైతన్యాన్ని రగిలించడానికి.. ఓ ధిక్కార స్వరం వినిపించడానికి 'పాట' ఎంతటి క్రియాశీలక పాత్ర పోషిస్తుందో.. తెలంగాణ ఉద్యమం ద్వారా తెలుగు ప్రజలందరికీ అనుభవంలోకి వచ్చే ఉంటుంది.

ఇప్పుడదే 'పాట'ను ప్రత్యేక హోదా ఉద్యమం కోసం జనసేన అధ్యక్షుడు పవన్ ఎత్తుకున్న తీరు మాత్రం సగటు అభిమానులకే వెగటు పుట్టించేదిగా తయారైంది. 'దేశ్ బచావో' పేరిట ఆల్బం విడుదల చేయబోతున్నానంటూ పవన్ ప్రకటించిన నాడు ఆయన అభిమానుల్లో కలిగిన ఉత్సాహమంతా

ఈరోజు నీరుగారిపోయిందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

ఆవేదన ప్రతిబించలేదు..:

ఆవేదన ప్రతిబించలేదు..:

ఓ ప్రజా ఆకాంక్షను వెలిబుచ్చే క్రమంలో.. దాని తీరు తెన్నులను.. పోరాట స్థితిగతులను ప్రతిబింబించేలా ఉద్యమ సాహిత్యం వస్తే.. అదో ఐక్య పోరాటానికి దారులు వేస్తుంది. కానీ పవన్ తాజాగా విడుదల చేసిన ఆల్బంలో ఇవేవీ లేవు. పవన్ తన సినిమాల్లోని పాటలనే డీజే మిక్స్ చేసి.. మధ్యలో తన అరుపులతో నింపేయడం పట్ల అటు అభిమానులు, ఇటు సామాన్య ప్రజలు నిరాశ చెందుతున్నారు.

అలా ఎందుకు చేయలేదు?:

అలా ఎందుకు చేయలేదు?:

'నారాజుగాకురా.. మా అన్నయ్యా.. నజీరు అన్నయా..' హిందూ-ముస్లిం మధ్య ఐక్యతను చాటిచెప్పే క్రమంలో మాస్టార్జీ చేత పవన్ రాయించుకున్న పాట ఇది. మాస్టార్జీతో పాటు పలువురు ప్రజా రచయితలతో పవన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతారు.

మరలాంటప్పుడు పవన్ మంచి ప్రజా రచయితతో హోదా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేలా.. అర్థవంతమైన సాహిత్యాన్ని రాయించుకోవాల్సింది పోయి.. ఇలా తన పాటలను తానే డీజే మిక్స్ చేసుకుని.. వీటితో ఉద్యమ స్పూర్తిని రగిలించాలనుకోవడమేమిటి? అన్న భావన ఇప్పుడు ప్రతీ ఒక్క ఏపీ పౌరుడిలోను కలుగుతోంది.

ఇలా చేస్తే ప్రశ్నిస్తే బాగుండేదేమో?:

ఇలా చేస్తే ప్రశ్నిస్తే బాగుండేదేమో?:

ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న పార్టీలను పవన్ పాట ద్వారా నిక్కచ్చిగా నిలదీస్తే.. ఎంత బాగుండేది అన్న అభిప్రాయం ప్రస్తుతం ప్రతీ ఒక్కరిలోను కలుగుతోంది.

ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానని ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్.. గేయ సాహిత్యం ద్వారా తన ప్రశ్నలను ఎక్కుపెట్టి ఉంటే.. ప్రభుత్వాలకు వణుకు పుట్టేది కదా! అని జనం భావిస్తున్నారు. ఇదేది లేకుండా.. కేవలం డీజే మిక్స్ తో హడావుడిగా తీసుకొచ్చిన 'దేశ్ బచావో' ఆల్బం ఉద్యమ స్ఫూర్తిని రగిలించడం మాటేమో గానీ.. పవన్ అభిమానులు మాత్రం దీంతో 'నారాజు' పడ్డట్టే కనిపిస్తున్నారు.

English summary
Fans and AP people are expressing disappointment on Pawan Kalyans Desh Bachao album which is a Dj mix released today
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X