సాంస్కృతిక ఉత్సవాల్లో అదరగొట్టిన కూటమి నేతలు.. హైలై‌ట్‌గా డిప్యూటీ స్పీకర్ !

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా విజయవాడలోని ఆంత్రాలూక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో 'ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు-2026' కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రజా సమస్యలు, అసెంబ్లీ చర్చలు, రాజకీయ విమర్శల మధ్య నిత్యం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులకు ఈ కార్యక్రమం ఒక మంచి ఆటవిడుపుగా మారింది. ప్రజాప్రతినిధులు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఆహ్లాదకర వాతావరణంలో సమయాన్ని గడిపారు.

ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. మంత్రి నారా లోకేష్, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. కాగా మంత్రి నారా లోకేష్ అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పిల్లలతో సరదాగా ఆటలు ఆడుతూ సందడి చేశారు. అలాగే ఇటీవల నిర్వహించిన క్రీడల్లో విజేతలైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బహుమతులు కూడా అందజేశారు.

cm-chandrababu-and-mlas-mlcs-particiated-in-cultural-festival-at-vijayawada-alsi-deputy-speaker-per

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు..

ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయ శ్రీ ప్రార్థనా గీతం ఆలపించి కార్యక్రమానికి శుభారంభం చేశారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సంగీతం, నృత్యం, నాటక ప్రదర్శనలు సభికులను ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు భీముడి పాత్రలో నటించి తన నటనతో అందరిని మెప్పించారు. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు శ్రీకృష్ణదేవరాయల వేషధారణలో ఆకట్టుకున్నారు. అలాగే మంత్రి కందుల దుర్గేష్ స్వాతంత్ర్య సమరయోధుడు వీరపాండ్య కట్టబొమ్మన్ పాత్రలో నటించి అద్భుత ప్రదర్శన కనబరిచారు.

ఇక ఎమ్మెల్యే విజయ్ కుమార్ 'రుద్రవీణ' చిత్రంలోని "లలిత ప్రియ కమలం" పాటను ఆలపించారు.వీరితో పాటు జీవీ ఆంజనేయులు, కామినేని శ్రీనివాస్, జయమంగళ వెంకటరమణ, సునీల్ తదితర ప్రజాప్రతినిధులు కూడా వివిధ పాత్రల్లో పాల్గొని కార్యక్రమాన్ని ఉత్సాహంగా మార్చారు. మరోవైపు బడ్జెట్ సమావేశాలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్.. సభ్యులు, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+