వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాకినాడ కలెక్టర్ పేరుతో వాట్సప్ అకౌంట్.. సైబర్ క్రిమినల్స్ చేసిన పనికి కలెక్టర్ షాక్!!

|
Google Oneindia TeluguNews

సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సామాన్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇట్లా ఎవరిని వదిలిపెట్టకుండా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పోలీసు శాఖలో ఉన్న ఉన్నతాధికారులతో పాటుగా, అనేక జిల్లాల కలెక్టర్లకు సైబర్ క్రిమినల్స్ షాకిచ్చారు. ఇక తాజాగా కాకినాడ జిల్లా కలెక్టర్ కు సైబర్ నేరగాళ్లతో తలనొప్పి తప్పలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే..

డబ్బులు కావాలని కలెక్టర్ పేరుతో వాట్సప్ సందేశాలు

డబ్బులు కావాలని కలెక్టర్ పేరుతో వాట్సప్ సందేశాలు


కాకినాడ జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల పేరుతో సైబర్ నేరగాళ్లు ఒక వాట్సాప్ నెంబర్ కు ఆమె ఫోటో ను డిపి గా పెట్టి అధికారులకు వాట్సప్ మెసేజ్ లు పంపించారు. తాను మీటింగ్ లో ఉన్నానని, ప్రస్తుతం మాట్లాడే పరిస్థితిలో లేదని, అర్జెంటుగా తమకు డబ్బు కావాలని, అమెజాన్ పే లో పంపించండి అంటూ ఆమె వాట్సాప్ సందేశాల ద్వారా అధికారులను అభ్యర్థించినట్టు మెసేజ్ లు పంపారు. ఇక ఈ మెసేజ్ లు చూసి షాక్ తిన్న అధికారులు కలెక్టర్ అమెజాన్ పే లో డబ్బులు పంపించమని అడగడం ఏమిటని ఆలోచించారు. ఆపై వాట్సప్ డిపి గా కలెక్టర్ ఫోటో ఉన్నప్పటికీ నెంబర్ వేరేగా ఉండడంతో ఇదొక ఫ్రాడ్ అని చర్చించుకున్నారు.

ఎస్పీకి ఫిర్యాదు చేసిన కలెక్టర్

ఎస్పీకి ఫిర్యాదు చేసిన కలెక్టర్


ఇక ఈ విషయాన్ని నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వాట్సాప్ లో తాను డబ్బులు అడిగినట్లుగా మెసేజ్ లు వెళ్లడంపై కలెక్టర్ షాక్ కు గురయ్యారు. వెంటనే జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబుకు ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తన పేరుతో ఎవరైనా ఎవరికైనా వాట్సప్ కాల్స్ చేసినా, మెసేజ్లను పంపినా ఎవరూ స్పందించ వద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ఫ్రాడ్ మెసేజ్ ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కృతిక శుక్ల సూచించారు.

యూపీకి చెందిన వ్యక్తి పనిగా గుర్తించిన పోలీసులు, యూపీకి స్పెషల్ టీమ్

యూపీకి చెందిన వ్యక్తి పనిగా గుర్తించిన పోలీసులు, యూపీకి స్పెషల్ టీమ్

కలెక్టర్ కృతిక శుక్ల ఫిర్యాదు మేరకు కాకినాడ త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఇదంతా సైబర్ నేరగాళ్ల పనిగా చెబుతున్నారు. యూపీ కి చెందిన హరి ఓం గుప్తా అనే వ్యక్తి నుంచి ఈ వాట్సాప్ సందేశాలు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. వాట్సప్ కోసం అతను వినియోగించిన ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు, యూపీ కి ఓ స్పెషల్ టీం ను పంపించారు. ఈ తరహా ఘటనలు గతంలోనూ అనేక చోటుచేసుకోగా తాజాగా కాకినాడ కలెక్టర్ కృతిక శుక్ల విషయంలో జరిగింది.

English summary
The Collector of Kakinada lodged a complaint with the SP against a cyber criminal who had created a WhatsApp account in the name of Kakinada Collector Kritika Shukla and was sending messages to the officials asking for money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X