Cyclone Arnab: అర్ణబ్ తుఫాన్ ఇప్పుడు ఎక్కడుంది ? లైవ్ లింక్ రిలీజ్..!

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్ణబ్ తుఫాన్ (Cyclone Arnab) ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర ప్రభావం చూపబోతోంది. ఇప్పటికే తీవ్ర వాయుగుండం నుంచి తుఫాన్ గా బలపడిన అర్ణబ్ గత 6 గంటల్లో గంటకు 15 కిమీ వేగంతో కదిలింది. ప్రస్తుతానికి ఇది విశాఖపట్నానికి 650కి.మీ., కాకినాడకు 730 కి.మీ., మచిలీపట్నానికి 830 కి.మీ., బాపట్లకు 910 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇవాళ అర్ధరాత్రికి ఇది తీవ్ర తుపాన్, రేపు అతి తీవ్ర తుపాన్ గా బలపడనున్నట్లు వెల్లడించింది.

అర్ణబ్ తుఫాన్ ఎల్లుండి ఉదయం బాపట్ల - విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. దీంతో ఈ మూడు రోజులు అత్యంత కీలకమని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని కోరుతోంది. అదే సమయంలో కోస్తా జిల్లాల్లో అధికారుల్ని అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారుల్ని కోరింది. అలాగే తుఫాన్ ఎక్కడ ఉందనే విషయాన్ని ఎప్పటికప్పుడు లైవ్ లో ట్రాక్ చేసేందుకు వీలుగా ఓ వెబ్ సైట్ లింక్ ను కూడా ఏపీ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ విడుదల చేసింది.

Cyclone Arnab AP Govt Releases Live Tracking Link Through RTGS

అర్ణబ్ తుఫాన్ గమనాన్ని తెలుసుకునేందుకు అవేర్ పేరుతో ఓ వెబ్ సైట్ లింక్ ను ఏర్పాటు చేసిన ఆర్టీజీఎస్.. దాన్ని ఎక్స్ లో షేర్ చేసింది. https://aware.ap.gov.in/dashboard లింక్ ను క్లిక్ చేస్తే అవేర్ వెబ్ సైట్ లోకి వెళ్లవచ్చు. అక్కడ తుఫాన్ గమనాన్ని లైవ్ లో ట్రాక్ చేయడంతో పాటు మీరు ఉండే జిల్లాల్లో వీస్తున్న గాలుల తీవ్రత, ఉష్ణోగ్రత, ఇతర వివరాలను కూడా పక్కాగా తెలుసుకునేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఈ లైవ్ లింక్ ద్వారా తుపాన్ గమనాన్ని తెలుసుకుని అప్రమత్తంగా ఉంటూ, అధికారులకు సహకరించాలని ప్రభుత్వం సూచిస్తోంది. ముఖ్యంగా ఈ మూడు రోజుల పాటు ఈ లైవ్ లింక్ ఎంతో ఉపయోగపడనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+