Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైఎస్ జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్ కాల్: అందుకు సిద్ధంగా ఉండాలని సూచన..!!

Cyclone Michaung: బంగాళాఖాతంలో ఏర్పడిన మిఛౌంగ్ తుఫాన్ ఉగ్రరూపాన్ని ధరించింది. పెను తుఫాన్‌గా ఆవిర్భవించింది. ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. నెల్లూరు- మచిలీపట్నం మధ్య ఈ తుఫాన్ తీరాన్ని దాటనుంది. ఆ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయంటూ భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఈ ఉదయం 11:30 గంటల సమయానికి ఈ తుఫాన్.. పుదుచ్చేరికి తూర్పు- ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నైకి తూర్పు-ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో 250, నెల్లూరు- 340, బాపట్ల- 360, మచిలీపట్నం- 390 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

Cyclone Michaung: PM Modi phone call to the AP CM YS Jagan

క్రమంగా ఇది పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 4వ తేదీన సాయంత్రం బాపట్ల- మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో సుడులు తిరుగుతూ ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది మిఛౌంగ్ తుఫాన్.

తీరానికి సమీపిస్తోన్న కొద్దీ తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, తమిళనాడు ఉత్తర ప్రాంత జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన ఈదురుగాలులు వణికిస్తోన్నాయి. రాయలసీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

వచ్చే 48 గంటల పాటు ఏకధాటిగా వర్షాలు కురుస్తాయని, 204.4 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. ఏపీ, తమిళనాడుకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. తీర ప్రాంతంతో పాటు వాటికి ఆనుకుని ఉన్న జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తలను తీసుకోవాలని హెచ్చరించింది.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఏపీ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. ముందు జాగ్రత్త చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాణనష్టాన్ని నివారించాలని సూచించారు. ఆహార నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ- తుఫాన్ ముందు జాగ్రత్త చర్యలపై ప్రధానికి వివరించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే ఏర్పాట్లు చేశామని, తీర ప్రాంత గ్రామాలను ఖాళీ చేయిస్తోన్నామని పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలను మోహరింపజేసినట్లు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+