Cyclone Michaung: బాపట్ల భయానకం: హోరుగాలి.. ముందుకొచ్చిన సముద్రం: తీరం అల్లకల్లోలం

బంగాళాఖాతంలో ఏర్పడిన మిఛౌంగ్ తుఫాన్ మహోగ్రంగా మారింది. అతి పెను తుఫాన్‌గా ఆవిర్భవించింది. ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. నెల్లూరు- మచిలీపట్నం మధ్య ఈ తుఫాన్ తీరాన్ని దాటనుంది. ఆ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయంటూ భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఈ సాయంత్రానికి బాపట్లకు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చలితీవ్రత పెరిగింది. రాయలసీమ మొదలుకుని ఉత్తరాంధ్ర వరకూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది.

Cyclone Michaung set to landfall at Machilipatnam near Bapatla of Andhra Pradesh

నెల్లూరులో అత్యధికంగా 219 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. బాపట్ల- 215, మచిలీపట్నం- 151.7, కావలి- 143.6, ఒంగోలు- 117, కాకినాడ- 77.6, నరసాపురం- 60.6, పొదలకూరు- 212, రేపల్లె- 117.5, చినగంజాం- 72.5 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది.

Cyclone Michaung set to landfall at Machilipatnam near Bapatla of Andhra Pradesh

ప్రత్యేకించి నెల్లూరు, కావలి, బాపట్ల, మచిలీపట్నంలల్లో పరిస్థితి భయానకంగా మారింది. రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక్కడ. ఈదురుగాలులు వణికిస్తోన్నాయి. తుఫాన్ బాపట్ల సమీపంలో తీరం దాటే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది.

బాపట్లలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈదురుగాలుల ధాటికి చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. హోర్డింగులు విరిగిపోయాయి. పలు చోట్ల మట్టిగోడలు కూలిపోయాయి. చెట్లు, హోర్డింగులు విరిగిపడటంతో పార్క్ చేసి ఉంచిన వాహనాలు ధ్వంసం అయ్యాయి.

హోర్డింగులు, ఇనుప రేకులతో కట్టిన ఫ్లెక్సీలు..రోడ్లపై పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని కోరారు. ఈదురు గాలులు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, తుఫాన్ తీరానికి సమీపించిన సమయంలో గంటకు 160 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని పేర్కొన్నారు.

Cyclone Michaung set to landfall at Machilipatnam near Bapatla of Andhra Pradesh

తుఫాన్ ధాటికి తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు పోటెత్తుతున్నాయి. కొన్ని చోట్ల సముద్రం ముందుకొచ్చింది. వోడరేవు, సూర్యలంక బీచ్, నిజాంపట్నం బీచ్ ఖాళీ అయ్యాయి. కొన్ని చోట్ల సముద్రం పోతీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకార గ్రామాల్లో జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+