నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉత్తరాంధ్రపై 'రోను' ఎపెక్ట్: ముందుకొచ్చిన సముద్రం, భయంతో ప్రజలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం కారణంగా రోను తుపాను శుక్రవారం నాడు మరింత ఉగ్రరూపం దాల్చనుంది. విశాఖకు 110, కాకినాడకు 60 కిలో మీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో తీర ప్రాంతంలో గంటకు 90 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.

ఏపీలోని అన్ని ఓడరేవుల్లో 4వ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి.

తుపాను నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల కింద ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వం రంగంలోకి దింపింది. ఏపీ పరిధిలో నేడు తీవ్ర రూపం దాల్చనున్న రోను తుపాను ఈ రోజు సాయంత్రానికి ఒడిశా వైపు వెళ్లనుంది. శనివారం అర్ధరాత్రి బంగ్లాదేశ్‌లో తీరం దాటనున్నట్లు అంచనా వేస్తున్నారు.

రోను తుఫాను వల్ల ఉత్తరాంధ్రపై బాగానే పడనుందని చెబుతున్నారు. భారీ వర్షం నుంచి అతి భారీ వర్షం వరకు.. 48 గంటలు ఉంటాయి. విజయనగరంలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

విశాఖలో ముందుకొచ్చిన సముద్రం, ప్రజల భయాందోళన

విశాఖలో సముద్రం భారీగా ముందుకు వచ్చింది. అలలు మీటర్ ఎత్తు వరకు ఎగిసి పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా సోంపేట, వజ్రపుకొత్తూరు వద్ద సముద్రం ముందుకు వచ్చింది. సముద్రం ముందుకు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పలుచోట్ల ఈదురు గాలులకు పంటలు పాడయ్యాయి. విశాఖలోని కొండకాలువ కాలనీల ప్రజలు భయాందోళనతో గడుపుతున్నారు. బండరాళ్లు విరిగి పడుతున్నాయి.

రోను తుఫాను

రోను తుఫాను

బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం కారణంగా రోను తుపాను శుక్రవారం నాడు మరింత ఉగ్రరూపం దాల్చనుంది.

రోను తుఫాను

రోను తుఫాను

విశాఖకు 110, కాకినాడకు 60 కిలో మీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో తీర ప్రాంతంలో గంటకు 90 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.

 సీఎం చంద్రబాబు అప్రమత్తం

సీఎం చంద్రబాబు అప్రమత్తం

రోను తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడా జనజీవనం అస్తవ్యస్థం కాకుండా చూడాలని, ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తుపాను తీవ్రత, ధోరణుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు.

 సీఎం చంద్రబాబు అప్రమత్తం

సీఎం చంద్రబాబు అప్రమత్తం

ఉండవల్లిలోని తన నివాస గృహం నుంచి బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.టక్కర్‌, తీరప్రాంత జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుపాను పరిస్థితి, యంత్రాంగం అప్రమత్తతపై సమీక్షించారు.

 సీఎం చంద్రబాబు అప్రమత్తం

సీఎం చంద్రబాబు అప్రమత్తం

లోతట్టు ప్రాంతాలవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలకు సన్నద్ధం కావడంతోపాటు పునరావాస శిబిరాల్లో భోజనం, తాగునీరు అందించాలన్నారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో గమనిస్తూ ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సూచించారు.

 సీఎం పర్యటన రద్దు

సీఎం పర్యటన రద్దు

రోను తుఫాను విశాఖ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు తిష్ట వేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి విశాఖ జిల్లా పర్యటన రద్దయింది.

 నిలిచిన స్వరాజ్ దీప్ నౌక, ప్రయాణీకుల పడిగాపులు

నిలిచిన స్వరాజ్ దీప్ నౌక, ప్రయాణీకుల పడిగాపులు

రోను తుఫాను నేపథ్యంలో అండమాన్ బయలుదేరి వెళ్లాల్సిన ప్రయాణికుల నౌక స్వరాజ్ దీప్ నిలిచిపోయింది. నౌక ఎక్కిన 1,218 మంది ప్రయాణికులు ఇటు నౌక దిగలేక, అటు ముందుకు సాగలేక నౌకలోనే చిక్కుకుపోయారు. దీనిపై సమాచారం అందుకున్న ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు నౌకలోని ప్రయాణికులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

English summary
Cyclone Roanu to bring heavy rain to coastal Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X