మేం నలుగురం కష్టపెడుతున్నామా, చంద్రబాబు ఏం మేజిక్ చేశారో కానీ పొగిడారు: పవన్ కళ్యాణ్
శ్రీకాకుళం: టిట్లీ తుఫాను బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అక్కుపల్లిలో తుఫాను బాధితులతో ఆయన శనివారం మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై మండిపడ్డారు. శ్రీకాకుళం రైతులు అధైర్యపడవద్దని, సంపూర్ణ రుణం కోసం పోరాటం చేస్తామని చెప్పారు. ఫల సాయం చేతికి వచ్చే వరకు రైతుకు ఆర్థిక భరోసా ఇవ్వాలన్నారు. కౌలు రైతులు, మత్స్యకారులకు కూడా అండగా ఉంటామన్నారు. ఈ మేరకు పవన్ చేసిన విమర్శలపై జనసేన శనివారం రాత్రి ట్వీట్ చేసింది.
అన్నీ ల్యాప్‌టాప్‌లలో తెలుసుకునే ముఖ్యమంత్రికి టిట్లీ తుఫాను గురించి తెలియదా అని ప్రశ్నించారు. అప్రమత్తత విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తుఫాను బాధితులను జగన్ పట్టించుకోవడం లేదన్నారు. లక్షలాది కొబ్బరి, జీడి మామిడి తోడలు నేలకూలాయని, రైతన్నలకు సాయం అందే వరకు అండగా ఉంటామని చెప్పారు. మీ బాధలను ప్రధానికి, ముఖ్యమంత్రికి తెలియజేస్తానని చెప్పారు. 1999లో తుఫాను వచ్చినప్పుడు చాలామంది వలసలు పోయారని, ఇప్పుడు ఆ పరిస్థితి మళ్లీ రావొద్దని చెప్పారు. చంద్రబాబు రబ్బరు బోట్లలో తిరుగుతూ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారన్నారు.

మేం నలుగురం చంద్రబాబును కష్టపెడుతున్నామా?
టిట్లీ తుఫాను కారణంగా ఏపీలోగా, పక్కన ఉన్న ఒడిశాలో కూడా నష్టం జరిగిందని పవన్ చెప్పారు. ఒడిశాలో విద్యుత్‌ను పునరుద్ధరించారని చెప్పారు. కానీ ఇక్కడి ప్రజలు ఇంకా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. చంద్రబాబు మాత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్, కేసీఆర్, మోడీ, జగన్‌లు కలిసి తనను కష్టపెడుతున్నారని చెబుతున్నారని, నిజంగా కష్టాల్లో ఉన్నది ప్రజలే అని చంద్రబాబు గుర్తించాలని ఎద్దేవా చేశారు.

అది నాకేం పని
నేను ఒడ్డున ఉండి రాళ్లు వేస్తున్నానని చంద్రబాబు అంటున్నారని, అలా నాకేం పని అని, 2014లో మీకు మద్దతిచ్చి గెలిపించానని, మీరు తప్పులు చేస్తుంటే, ప్రజలు కష్టాల్లో ఉంటే వాటిని బలంగా చెబుతున్నానని పవన్ అన్నారు. అసలు ఇక్కడి మంత్రులు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వారికి పట్టడం లేదన్నారు.

రామ్మోహన్ నాయుడు మన వద్దకు రావాలి
ఏదో కొద్దిగా సాయం చేసి, అన్నీ చేశామంటే కుదరదని పవన్ కళ్యాణ్ అన్నారు. కొబ్బరి, జీడి, మామిడి పంటలకు ఇక్కడి ప్రాంతం ప్రసిద్ధి అని, వాటికి సంబంధించిన బోర్డులు పెట్టి అనుబంధ పరిశ్రమలు తెచ్చి రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు. అప్పుడు అచ్చెన్నాయుడు ఇంట్లో చింతపండు అయిపోయినా, రామ్మోహన్ నాయుడు ఇంట్లో చక్కెర అయిపోయినా వాళ్లే మన వద్దకు రావాలని, మంత్రులు మన వద్దకు వచ్చే విధంగా ఎదగాలన్నారు.

లోకేష్‌ను సముదాయించినట్లే ఇక్కడా చేయండి
ఎంతో కష్టపడి పంట పండిస్తే, ఇల్లు, కూడు, గుడ్డ కూడబెడితే అవి పోతే రాజకీయ నాయకులను కాకుండా ప్రజలు ఎవరిని అడుగుతారని పవన్ ప్రశ్నించారు. అలా అడిగితే బుల్డోజర్లతో తొక్కిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుల్డోజర్‌తో తొక్కిస్తామని సీఎం అనడం ఏమిటన్నారు. ముఖ్యమంత్రిని చేయి.. ముఖ్యమంత్రిని చేయి అని లోకేష్ అడుగుతుంటే సముదాయిస్తున్నట్లే, ప్రజలనూ సముదాయించాలని అన్నారు. అరెస్టులు చేయించడం, భయపెట్టడం సరికాదన్నారు.

చంద్రబాబు ఏం మేజిక్ చేశారో కానీ
అన్నీ చేశామని చంద్రబాబు తిరిగి చెబుతున్నారని, కానీ ఇప్పటికీ కరెంట్ లేదని పవన్ అన్నారు. చంద్రబాబు ఏం మేజిక్ చేశారో కానీ గవర్నర్ గారు కూడా సహాయక చర్యలు బాగున్నాయని పొగిడారని ఎద్దేవా చేశారు. సీఎంకు, గవర్నర్‌కు పడదని, కానీ అదే గవర్నర్‌తో పొగిడించుకున్నారని చెప్పారు. జనం ఇంత బాధల్లో ఉంటే జగన్ రావడం లేదన్నారు. పాలకులకు శ్రీకాకుళం అంటే చిన్నచూపు అన్నారు.
-
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications