Wipha Cyclone: ముంచుకొస్తున్న మహా ప్రళయం.. ఏపీకి దబిడి దిబిడే..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. మరో 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చైనా- హాంకాంగ్ లో బీభత్సం సృష్టించిన విఫా తుఫాన్.. బంగాళాఖాతంలోకి ప్రవేశించిందని పేర్కొంది. తుఫాన్ కారణంగా రాబోయే 3 రోజుల పాటు ఏపీలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
ఉత్తర బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. విఫా తుఫాన్ చైనా, హాంకాంగ్ ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది.. అది తీరం దాటి బంగాళాఖాతంలోకి ప్రవేశించిన నేపథ్యంలో ప్రస్తుతం తుఫానుగా రూపాంతరం చెందింది. ఈ అల్పపీడనం క్రమేపీ బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో వచ్చే మూడు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం తీరం వెంబడి గంటకు 60 కి.మీ గరిష్ఠ వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గత 24 గంటల్లో గుంటూరు, మాచర్ల, నర్సీపట్నంలో 7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైందని అధికారులు పేర్కొన్నారు.

తాజాగా చైనా, హాంకాంగ్, దక్షిణ కోరియాలో విఫా తుఫాన్ బీభత్సం సృష్టించింది. తుఫాన్ ధాటికి అక్కడ వందలాది భవనాలు ధ్వంసం అయ్యాయి. గంటకు 150 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. హాంకాంగ్ లో 400 విమానాలు రద్దయ్యాయి. తుపాన్ బీభత్సానికి దక్షిణ కొరియాలో 17 మంది మృతి చెందారు. భారీ వర్షాలతో 400కు పైగా భవనాలు దెబ్బతిన్నాయి. తుఫాన్ ధాటికి ఫిలిప్పీన్స్ లో 370,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.












Click it and Unblock the Notifications