బంగాళాఖాతంలో అల్ప పీడనం: తుఫానుగా మారే అవకాశం
ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్‌కు సమీపంలో బుధవారం రాత్రి అల్పపీడన ద్రోణి ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీంతోపాటు అదే ప్రాంతంలో ఉపరితల అవర్తనం కూడా ఏర్పడిందని వెల్లడించింది.
విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్‌కు సమీపంలో బుధవారం రాత్రి అల్పపీడన ద్రోణి ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీంతోపాటు అదే ప్రాంతంలో ఉపరితల అవర్తనం కూడా ఏర్పడిందని వెల్లడించింది.

ఇది వచ్చే 48గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరికొద్ది రోజుల్లోనే ఇది తుఫాన్‌గా మారవచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ తుఫాను పేరును సైక్లోన్ మోరాగా పిలవనున్నారు.












Click it and Unblock the Notifications