రాజకీయాల్లోకి దగ్గుబాటి వారసుడు: పర్చూరు నుండి బరిలోకి?

Posted By:
Subscribe to Oneindia Telugu

ఒంగోలు: మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరీ తనయుడు చెంచురాము 2019 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి చెంచురామ్ బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం.

షాక్: ఎంపీలతో పాటు ఎమ్మెల్యేల రాజీనామా, జగన్ దీక్ష?

ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు పలు దఫాలు విజయం సాధించారు. దీంతో ఈ స్థానం నుండి చెంచురామును బరిలోకి దింపే అవకాశాలున్నట్టు ప్రచారం సాగుతోంది.

జగన్ దెబ్బ: ఆత్మరక్షణలో చంద్రబాబు, ఏం చేస్తారు? జగన్ దెబ్బ: ఆత్మరక్షణలో చంద్రబాబు, ఏం చేస్తారు?

2014 ఎన్నికలకు ముందు కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరీ కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరారు. ఏపీ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

చెంచురామ్ పర్చూరు నుండి బరిలోకి

చెంచురామ్ పర్చూరు నుండి బరిలోకి

బిజెపిలో కీలక నేతగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరీ తనయుడు చెంచురామును 2019 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు దగ్గుబాటి కుటుంసభ్యులు రంగంసిద్దం చేశారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఆ కుటుంబం నుండి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

పర్చూరు నుండే ఎందుకంటే

పర్చూరు నుండే ఎందుకంటే

ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గాన్ని ఎందుకు ఎంపిక చేసుకొన్నారంటే ఈ నియోజకవర్గం దగ్గుబాటి కుటుంబానికి అత్యంత పట్టుంది. దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు ఈ నియోజకవర్గం నుండి పలు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడ దగ్గుబాటి ఈ నియోజకవర్గం నుండి విజయం సాధించారు. దీంతో చెంచురాము ఈ నియోజకవర్గం నుండి బరిలోకి దింపితే విజయం నల్లేరు మీద నడకేననే అభిప్రాయంతో ఆ కుటుంబం ఉందని సమాచారం.

  Chandrababu Naidu Blocked The Entry Of 2 Telugu Leaders Into Modi's | Oneindia Telugu
  మరోసారి ఎంపీగా పురంధేశ్వరీ

  మరోసారి ఎంపీగా పురంధేశ్వరీ

  కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో దగ్గుబాటి పురంధేశ్వరీ ఎంపీగా విజయం సాధించారు.2004 ఎన్నికల సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో ఆమె ఎంపీగా ,దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల సమయంలో ఆమె రాజంపేట నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు మరోసారి ఆమె బిజెపి అభ్యర్థిగా 2019 లో ఎంపీగా బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే ఏ స్థానం నుండి ఆమె పోటీ చేస్తారనేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

  పర్చూరులో టిడిపి అభ్యర్థి సాంబశివరావు

  పర్చూరులో టిడిపి అభ్యర్థి సాంబశివరావు


  ప్రస్తుతం పర్చూరు అసెంబ్లీ స్థానం నుండి టిడిపి ఎమ్మెల్యే సాంబశివరావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో టిడిపి బిజెపిల మధ్య పొత్తు ఉంటుందా, ఉండదా అనే విషయమై ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పడం కష్టమే. అయితే పొత్తుంటే ఈ స్థానం దగ్గుబాటి చెంచురాముకు దక్కే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. చెంచురాము రాజకీయ రంగ ప్రవేశం జరిగితే మాత్రం ఈ స్థానం నుండి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై మాత్రం దగ్గుబాటి కుటుంబం నుండి అధికారికంగా మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Bharatiya Janata Party (BJP) women's wing chief, Daggubati Purendeswari is all set to launch her son, Chenchu Ram into politics. She wants him to contest from Parachuru in Prakasam district.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి