తుపాకి పెట్టి రమ్మంటున్నారు, ఏం చేయాలో తెల్సు: కేసీఆర్‌పై దానం

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు, మాజీ మంత్రి దానం నాగేందర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన శుక్రవారం దుమ్మెత్తి పోశారు. కాంగ్రెస్ నేతల పైన తుపాకులు గురి పెట్టి తెరాసలో చేరుతారా లేక చస్తారా అని బెదిరిస్తున్నారని దానం ఆరోపించారు. పోలీసులు తెరాస ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.

ప్రభుత్వం అండతో చెలరేగుతున్న పోలీసులను ఏం చేయాలో తమకు తెలుసునని చెప్పారు. రెవెన్యూ అధికారులు అంతా తమదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అహంభావంతో ఏ ప్రభుత్వం కూడా నడవదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని రెచ్చగొట్టవద్దని కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 Danam says Congress will win in Greater elections

తమను రెచ్చగొట్టవద్దని, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తాము తప్పకుండా సత్తా చాటుతామని చెప్పారు. అధికారం ఉంది కదా అని ఎన్ని దౌర్జన్యాలు చేసినప్పటికీ విజయం మాత్రం తమదే అన్నారు. బుర్ర చెడిపోయిన వారు కూడా వాస్తు పేరుతో ఇన్ని మార్పులు చేయరని ఎద్దేవా చేశారు.

టీపీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తాం: నర్సిరెడ్డి

తెరాస అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యగమిస్తామన్నారని, కాని వచ్చాక నిరుద్యోగులను మోసం చేశారని టీడీపీ నాయకుడు నన్నూరి నర్సిరెడ్డి ఆరోపించారు. గతంలో తెలంగాణ భవన్‌లో వార్‌ రూమ్‌ పెట్టి ఉద్యోగ ఖాళీల వివరాలు సేకరించారని ఆ సమాచారం ఏమైందన్నారు. దీనికి నిరసనగా టీపీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల ఇళ్ల ముందు ధర్నా చేస్తామన్నారు.

ఎర్రబెల్లికి కడియం సవాల్

తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావుకు మంత్రి కడియం శ్రీహరి సవాల్ విసిరారు. మంచి పాలన అందిస్తున్న కేసీఆర్‌ను విమర్శించే హక్కు టీడీపీ నేతలకు లేదన్నారు. ఎర్రబెల్లికి దమ్ముంటే చంద్రబాబుతో మాట్లాడి కేసీఆర్‌లా ఏపీ ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇప్పించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+