'ఆమె' విషయంలో సీఎం వైఎస్ జగన్ అనూహ్య నిర్ణయం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజమండ్రి పర్యటన సందర్భంగా ఆయన్ను ను పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి కలిశారు. ఉన్నత విద్యకోసం గతంలో ముఖ్యమంత్రి చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపింది. నాసా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని జాహ్నవి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విభాగంలో మొదటి ఇండియన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. గతంలో జాహ్నవి ఏవియేషన్‌ శిక్షణకు ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షల సాయం అందజేసింది.

అమెరికా ఫ్లోరిడాలో కమర్షియల్‌ పైలెట్‌ శిక్షణ నిమిత్తం అవసరమైన ఆర్ధిక సాయం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేయగా దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు.భారత సంతతికి చెందిన కల్పనాచావ్లా, సునీతా విలియమ్స్‌లా అంతరిక్షంలోకి అడుగుపెట్టాలన్నదే తన లక్ష్యమని వివరించింది. జాహ్నవి ఐఐఏఎస్‌ ఫ్లోరిడా, యూఎస్‌ఏ నుండి సైంటిస్ట్‌ వ్యోమగామి అభ్యర్ధిగా సిల్వర్‌ వింగ్స్‌ అందుకున్నారని సీఎంకి సమాచార శాఖ మంత్రి వేణుగోపాల్‌ వివరించారు. మంత్రితోపాటు జాహ్నవి కుటుంబ సభ్యులు కూడా సీఎంను కలిసినవారిలో ఉన్నారు.

dangetijahnavimeetapcmysjagan1

కల్పనా చావ్లా ఇండియన్ - అమెరికన్ వ్యోమగామి. హర్యానా రాష్ట్రంలో జన్మించారు. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ మహిళగా ఆమె ఖ్యాతి గడించారు. 1997 లో మొదటి సారిగా కొలంబియా స్పేస్ షటిల్ లో రోబోటిక్ ఆర్మ్ ఆపరేటరుగా అంతరిక్షంలోకి వెళ్లారు. 2003 లో రెండోసారి అదే రకమైన స్పేస్ షటిల్ లో ప్రయాణించారు. 2003 ఫిబ్రవరి 1 న ఆమె ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుండగా దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి గురైన ఆ నౌకలో ఉన్న ఏడుగురు మృ‌తిచెందారు. ఆ ఏడుగురిలో కల్పాచావ్లా కూడా ఒకరు. ఆమె మరణానంతరం కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్ అందజేశారు. పలు వీధులు, విశ్వవిద్యాలయాలు, సంస్థలకు ఈమె పేరు పెట్టారు. ఇండియాలో ఆమెకు మంచి గుర్తింపు లభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+