ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు - ఈ రూపాల్లో అమ్మవారు, దర్శనం ఇలా..!!

దసరా వేడుకలు సమీపిస్తున్నాయి. ప్రతీ ఏటా దసరా సమయంలో విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ సారి కూడా భక్తుల సంఖ్య భారీగా ఉంటుందని ఆలయ పాలక మండలి అంచనా వేస్తోంది. ఈ ఏడాది దసరా వేడుకల నిర్వహణకు సంబంధించి ఆలయ వైదిక కమిటీ నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 15 నుంచి 23 వరకు 9 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. తొమ్మిది రోజులు తొమ్మది రూపాల్లో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.

శరన్నవరాత్రి వేడకలు
ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 15 నుంచి 23వ తేదీ వరకు శరన్నవరాత్రి వేడకలు నిర్వహించాలని నిర్ణయించారు. అక్టోబర్ 15న ఉదయం అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహించి, బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. అనంతరం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సర్వదర్శనానికి అనుమతిస్తారు. మిగతా రోజుల్లో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారిని దర్శించుకొనేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. 20న మూలా నక్షత్రం రోజున సరస్వతీ అలంకారంలో ఉన్న అమ్మవారి దర్శనానికి వేకువ జామున 2 నుంచి రాత్రి 11 గంటల వరకు క్యూ లైన్లలో వచ్చిన భక్తులకు దర్శనం కల్పిస్తారు.

Dasara

అమ్మవారి దర్శనం
సాధారణంగా దసరా మొదటి రోజున స్వర్ణకవచాలంకృత దుర్గాదేవికగా దర్శనమిచ్చే అమ్మవారు ఈ సారి బాలాత్రిపుర సుందరీ దేవిగా దర్మనమివ్వనున్నట్లు తెలుస్తోంది. 23న విజయదశమిని పురస్కరించుకొని ఉదయం 10.30 గంటలకు యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం, సాయంత్రం గంగా పార్వతీ సమేత దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తుల తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇక, ఈ తొమ్మది రోజులు అమ్మవారి తొమ్మిది రూపాల్లో దర్శనం ఇవ్వనున్నారు. అక్టోబర్ 15న తొలి రోజున అమ్మవారి బాలా త్రిపురసుందరీ దేవి రూపంలో భక్తులు దర్శనమిస్తారు.

Dasara

భారీగా ఏర్పాట్లు
16న గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారు అనుగ్రహిస్తారు. 17న అన్నపూర్ణదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 18న మహాలక్ష్మీ దేవి, 19న లలితా త్రిపురసుందరీదేవి, 20న సరస్వతి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 21న దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలతో తరలివచ్చే అవకాశం ఉంది. 22న మహిషాసురమర్ధని, 23న రాజరాజేశ్వరి దేవగా అమ్మవారు భక్తులకు దర్శనిమస్తారని వైదిక కమిటీ వెల్లడించిది. ఇక, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రములు..భక్తులు ఈ తొమ్మది రోజులు అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లకు దేవాలయ పాలక మండలి సిద్దం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+