రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్, జిల్లాల వారిగా వీరికే బాధ్యతలు, పారిశుద్ద, తాగునీరు

భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక ప్రాంతాలు జలమయం అయ్యి అతలాకుతలం కావడంతో ఆ ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం సిద్ధం అయ్యింది. పారిశుద్ధ నిర్వహణ, తాగునీటి సరఫరా, సహాయక చర్యలు తదితర పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను పంపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

వరద బాధిత గ్రామాల్లో చేపట్టాల్సిన సహాయ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి వారికి సలహాలు, సూచనలు ఇచ్చారు. వరద బాధిత జిల్లాలైన గుంటూరు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, కాకినాడ, కోనసీమ, బాపట్ల, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వరద పీడిత ప్రాంతాల్లో తక్షణం సహాయక చర్యల పనులు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

DCM Pawan Kalyan has formed special teams to monitor the work in the flood affected districts

జిల్లాల వారీగా అధికారుల బృందాలను ఏర్పాటు చేసిన డీసీఎం పవన్ కల్యాణ్ వెంటనే ఆ ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని, అన్ని పనులను దగ్గరుండి పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి వారికి ఆ బాధ్యతలు అప్పగించారు. పశ్చిమగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ కృష్ణ తేజ ఆధ్వర్యంలో మరో ఇద్దరు అధికారులు సంబంధిత పనులను పర్యవేక్షించాలని పవన్ కల్యాణ్ సూచించారు.

ఏలూరు, గుంటూరు జిల్లాలో ఉపాది హామీ పథకం డైరెక్టర్ వైవీకే షణ్ముఖ కుమార్ ఆధ్వర్యంలో మరో ఇద్దరు అధికారులు పనులను పర్యవేక్షించాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. పల్నాడు జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ అదనపు కమిషనర్ సుధాకర్ పనులను పర్యవేక్షించనున్నారు. తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆర్ డబ్ల్యుఎస్ ఇన్ చీఫ్ సంజీవరెడ్డి ఆద్వర్యంలో మరో ఇద్దరు ఇంజనీర్లు పనులు ప్రర్యవేక్షిస్తున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో నరేగా జాయింట్ కమిషనర్ ఎం. శివప్రసాద్ పనులు పర్యవేక్షిస్తున్నారు. కోనసీమ, బాపట్ల జిల్లాల్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ బాలునాయక్, మరో ఇద్దరు ఇంజనీర్లు సంబంధిత పనులను ప్రవేశించనున్నారు. ప్రభుత్వం సూచించిన పనులు కచ్చితంగా పాటించి ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొంచెం కోలుకున్న తర్వాత ఆయా జిల్లాల్లో పర్యటిస్తారని సంబంధిత అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+