లడ్డూ వివాదం, టీటీడీ మొత్తం ఆస్తులు, స్వామి ఆభరణాల లెక్కలు వేస్తాం, పవన్
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామిపై ఉన్న విశ్వాసంతో భక్తులు ఇంతకాలం శ్రీవారికి ఆస్తులు, బంగారం రూపంలో కానుకలు ఇస్తున్నారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. తిరుమల శ్రీవారికి కొన్ని దశాబ్దాలుగా రాజులు, భక్తులు ఆభరణాలు అందజేశారని, వాటి జాబితాను పరిశీలిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
శ్రీవాణి ట్రస్టు ద్వారా ఒక్కో టికెట్ కు టీటీడీ అధికారులు రూ. 10, 500 తీసుకున్నారని, అందుకు బిల్లు రూ. 500 మాత్రమే ఇచ్చారని డీసీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. శ్రీ వాణి ట్రస్టు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఆదాయాన్ని నాటి టీటీడీ పాలక మండళ్లు ఆ నిధులు ఎటుదారి మళ్లించారు అనే విషయంలో కూడా విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు నాయుడుకు తాను ఇప్పటికే మనవి చేశానని డీసీఎం పవన్ కల్యాణ్ అన్నారు.

సోమవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ టీటీడీకి సంబంధించి ఓ ప్రకటన విడుదల చేశారు. ఇదే సమయంలో ఆ ప్రకటనలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత టీటీడీ పాలకమండలి శ్రీవారి ఆస్తులను కాపాడారా అని ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయని డీసీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ ఆస్తులను, శ్రీవారి ఆభరణాలను ఆ ప్రభుత్వం కాపాడిందా ?, లేదా ? అనే కోణంలో కూడా విచారణ జరిపిస్తామని డీసీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
శ్రీవాణి ట్రస్ట్ కి భక్తులు ఇంతకాలం ఇచ్చిన విరాళాలు, వాటి ఖర్చుల లెక్కలను పరిశీలిస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు. టీటీడీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలలో వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని, వాటి వివరాలు పూర్తిగా పరిశీలిస్తామని, హైదరాబాద్, ముంబాయి నగరాల్లో కూడా టీటీడీకి ఆస్తులు ఉన్నాయని, వాటిని వివరాలను పరిశీలిస్తామని డీసీఎం పవన్ కల్యాణ్ అన్నారు.

టీటీడీకి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని, వాటి వివరాలు ఏమిటని పరిశీలించాలని సీఎం చంద్రబాబు నాయుడుకు తాను ఇప్పటికే మనవి చేశానని పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ ఆస్తులే తాకట్టుపెట్టిందని, టీటీడీకి చెందిన ఆస్తులను వారు వదిలి పెట్టారా అంటూ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
గత వైసీపీ పాలనలో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేశారని, ఇలాంటి సమయంలో శ్రీవారి ఆస్తులు భద్రంగా ఉన్నాయా, లేదా ? అని ప్రజలకు అనుమానం ఉందని, శ్రీవారి భక్తులు, ప్రజల అనుమానం తీర్చే బాధ్యత మా కూటమి ప్రభుత్వంపై ఉందని, ఆ విషయంపై క్షుణ్ణంగా విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు నాయుడుకు తాను సూచించానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. మొత్తం మీద తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలను, వాటి లెక్కలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని డీసీఎం పవన్ కల్యాణ్ చెప్పడం తీవ్ర చర్చకు దారితీసింది.
-
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications