వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్సీ కారులో డెడ్ బాడీ ఘటన.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టుకు లోకేష్ డిమాండ్!!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కారులో డెడ్ బాడీ ఘటన దుమారం రేపింది. ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మృతి చెందిన ఘటన ఇప్పుడు కలకలంగా మారింది. ఈ ఘటనపై టీడీపీ వైసీపీ ఎమ్మెల్సీని, జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తుంది.

వైసీపీ ఎమ్మెల్సీ కారులో డెడ్ బాడీ... ఎమ్మెల్సీ చంపేశారంటూ మృతుడి కుటుంబం ఆరోపణ

వైసీపీ ఎమ్మెల్సీ కారులో డెడ్ బాడీ... ఎమ్మెల్సీ చంపేశారంటూ మృతుడి కుటుంబం ఆరోపణ

ఏపీ వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కారులో అనుమానాస్పదంగా మరణించిన యువకుడు సుబ్రహ్మణ్యం మృతదేహం లభించడంతో సుబ్రహ్మణ్యం కుటుంబం ఎమ్మెల్సీ ఉదయ్ బాబు పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. నిన్న రాత్రి తమ కుమారుడిని ఎమ్మెల్సీ ఉదయ్ బాబు తీసుకువెళ్లారని, అర్ధరాత్రి సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లుగా ఎమ్మెల్సీ కారులో ఇంటికి తీసుకు వచ్చారని, అనుమానంతో అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఆ కారు వదిలిపెట్టి మరో కారులో ఎమ్మెల్సీ ఉదయ్ బాబు అక్కడ నుంచి వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ బిడ్డను ఎమ్మెల్సీ పొట్టన బెట్టుకున్నారని కన్నీటిపర్యంతం అవుతున్నారు.

వైసీపీ మాఫియా.. ఏపీని బీహార్ కంటే దారుణంగా మార్చేసింది


ఇక ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడీ ఘటనపై వైసీపీ సర్కార్ టార్గెట్ గా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కారులో సుబ్రహ్మణ్యం మృతదేహం ఉన్న వీడియోను, ఆ మృతదేహాన్ని చూస్తూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న వీడియోను పోస్ట్ చేసిన లోకేష్ ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు తీసుకున్న చర్యలను ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీహార్ కంటే దారుణమైన రాష్ట్రంగా వైసీపీ మాఫియా మార్చేసిందని లోకేష్ ఆరోపించారు.

పోలీసులు ఎమ్మెల్సీని ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు: ప్రశ్నించిన లోకేష్

పోలీసులు ఎమ్మెల్సీని ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు: ప్రశ్నించిన లోకేష్

వైసీపీ నాయకుల నేరాలు, ఘోరాలకు సామాన్య ప్రజలు బలైపోతున్నారు అని లోకేష్ మండిపడ్డారు. తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యంను అత్యంత దారుణంగా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు, దానిని యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస క్రీడకు అద్దం పడుతుందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు తమ కుమారుని బలవంతంగా తీసుకు వెళ్లి హతమార్చారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నా, అతనిపై పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయలేదని, ఎందుకు అరెస్టు చేయలేదని లోకేష్ ప్రశ్నించారు.

వైసీపీ నేతలకు హత్యలు చేసుకోవడానికి స్పెషల్ లైసెన్సు ఏమైనా ప్రభుత్వం ఇచ్చిందా?

వైసీపీ నేతలకు హత్యలు చేసుకోవడానికి స్పెషల్ లైసెన్సు ఏమైనా ప్రభుత్వం ఇచ్చిందా?


ఇక వైసీపీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు హత్యలు, అరాచకాలు చేసుకోవడానికి స్పెషల్ లైసెన్సు ఏమైనా ప్రభుత్వం ఇచ్చిందా అంటూ లోకేష్ నిలదీశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన లోకేష్, సుబ్రహ్మణ్యం ను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు, అతని అనుచరులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాదు ఈ హత్యపై సిబిఐ ఎంక్వయిరీ కూడా వేయాలని లోకేష్ పేర్కొన్నారు.

మృతి చెందిన డ్రైవర్ కుటుంబానికి నారా లోకేష్ ఫోన్ .. పరామర్శ

మృతి చెందిన డ్రైవర్ కుటుంబానికి నారా లోకేష్ ఫోన్ .. పరామర్శ

అంతేకాదు వైసీపీ ఎమ్మెల్సీ కారులో అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్న డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి నారా లోకేష్ ఫోన్ చేశారు. సుబ్రహ్మణ్యం మృతితో తీవ్ర ఆవేదనలో ఉన్న ఆ కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్లో పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

జరిగిన ఘటనపై కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. యువకుడిని అన్యాయంగా చంపేసి కట్టు కథలతో కేసును తప్పుదోవ పట్టించారని లోకేష్ ఆరోపించారు. ఎమ్మెల్సీ అనంత బాబును తక్షణమే అరెస్టు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.

English summary
The dead body incident in the YSRCP MLC car has caused tension in AP politics. Nara Lokesh is demanding the arrest of MLC Anantha Uday Babu in the wake of the deceased's family allegations against YCP MLC Anantha Babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X