ఏపీలో మరణ మృదంగం.. నెల్లూరులో కారు ప్రమాదంపై చంద్రబాబు,వైఎస్ జగన్ దిగ్భ్రాంతి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వరుస ప్రమాద ఘటనలు చోటు చేసుకొని అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు తెల్లవారుజామున సింహాచలంలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటన మరిచిపోక ముందే నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఒక ఇంట్లోకి కారు దూసుకు వెళ్లడంతో ఘోరప్రమాదం చోటుచేసుకుంది.

ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు మృతి
ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు .ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులు, వాళ్లతో పాటు కారు దూసుకు వెళ్లిన ఆ ఇంట్లో ఉన్న మరొక వ్యక్తి మృత్యువాత పడ్డారు. అభిషేక్, జీవన్, నరేష్, విఘ్నేష్, అభి సాయి ల తో పాటు , వెంకట రమణయ్య అనే వ్యక్తి మృతి చెందాడు.ముంబై జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్ బంకు వద్దకు రాగానే కారు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకుపోయింది.

Death toll in AP six people died in Car accident in Nellore cm chandrababu ys jagan shocked

విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు
కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడగా నెల్లూరులో చికిత్స పొందుతూ ఐదుగురు మరణించారు. ఇక ఈ దుర్ఘటన పైన నెల్లూరు జిల్లా కారు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పైన సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఆరుగురు మరణించడం బాధాకరమని చంద్రబాబు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

అత్యంత బాధాకరం అన్న వైఎస్ జగన్
నెల్లూరు జిల్లాలో జరిగిన కారు ప్రమాద ఘటన పైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఐదుగురు వైపు విద్యార్థులతో పాటు మరొక వ్యక్తి మరణించడం పైన ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ మిగతా వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటువంటి దుర్ఘటన జరగడం అత్యంత బాధాకరమని వైయస్ జగన్ విచారం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+