దీపం 2 పథకంపై సూపర్ న్యూస్.. గ్యాస్ డబ్బుల కోసం ఎదురుచూసే అవసరం లేదు!

మహిళలు మరియు నిరుపేద కుటుంబాలు ఇంధన అవసరాలను తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం 2.0 పథకాన్ని అందిస్తోంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా అర్హుల గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని నిర్ణయించిన చంద్రబాబు క్యాబినెట్ ఈ పథకం అమలు విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది.

లబ్ధిదారుల ఖాతాలలో నాలుగు నెలలకు ఒకసారి నగదు జమ

ఇకపై లబ్ధిదారుల ఖాతాలలో నాలుగు నెలలకు ఒకసారి ఒకేసారి నగదు జమ చేయడం ద్వారా పథకాన్ని లబ్ధిదారులకు సులభంగా అందించనున్నట్టు తెలుస్తోంది. సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అంటే నాలుగు నెలలకు ఒక సిలిండర్, ఈ క్రమంలో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసారా లేదా అన్న దానితో సంబంధం లేకుండా నిర్ణీత వ్యవధిలో నగదును నేరుగా బ్యాంకు ఖాతాలలో జమ చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Deepam 2 scheme Beneficiaries will now receive cash directly into their accounts every four months

సిలిండర్ బుకింగ్ తో ఏమాత్రం పని లేకుండా నగదు జమ

ఈ కొత్త నిర్ణయం ప్రకారం సిలిండర్ బుకింగ్ తో ఏమాత్రం పని ఉండదు. లబ్ధిదారులు సిలిండర్ బుక్ చేసుకుని డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు, నిరుపేద కుటుంబాలకు ఈ నిర్ణయం ద్వారా లబ్ది జరుగుతుంది. పథకం సకాలంలో, సమర్థవంతంగా అమలు అవుతుంది. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్న క్రమంలోనే దీపం 2.0 పథకంలో ఈ మార్పుకు చంద్రబాబు, ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నాయి

మహిళల ఆర్ధిక భారం తగ్గించటమే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు, ఏడాదికి మూడు ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్న చంద్రబాబు మహిళల ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. ఇప్పటివరకు దీపం 2.0 పథకంలో లబ్ధిదారులు ముందుగా సిలిండర్ బుక్ చేసుకుని డబ్బులు చెల్లించి తర్వాత ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ పొందుతున్నారు. అయితే ఇది అనేక రకాలుగా అసౌకర్యానికి దారితీస్తోంది.

చంద్రబాబు నిర్ణయం పట్ల మహిళల సంతోషం

ఈ క్రమంలోనే లబ్ధిదారులకు నిర్ణీత వ్యవధిలో నగదు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకోవడం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దీపం 2.0 పథకం విస్తరణలో భాగంగా తీసుకుంటున్న ఈ నిర్ణయం ఉచిత సిలిండర్ లతోపాటు, నగదు బదిలీ వ్యవస్థ, మహిళల సాధికారతకు దోహదం చేస్తుంది. దీనికోసం ప్రభుత్వం బ్యాంకు లింకేజీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వ్యవస్థను మరింత బలోపేతం చేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+