వ్యభిచారం: ఫిరాయింపుపై రఘువీరా, బాబుపై భూమన
హైదరాబాద్: కొందరు నాయకులు పార్టీలు మారడంపై ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ రఘువీరా రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నేతల పార్టీ ఫిరాయింపు వ్యవహారం వ్యభిచారం కన్నా హీనంగా ఉందని మండిపడ్డారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎన్నికల సంఘం వీరిపై చర్యలు తీసుకోవాలని రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రస్తుత రాజకీయ వాతావరణంలో కొందరు నాయకులు ఆక్సిజన్ లేకుండా ఉంటారేమో గానీ, అధికారం లేకుండా ఉండలేకపోతున్నారని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎంపీలిద్దరూ పార్టీలు ఫిరాయించడం ముమ్మాటికీ అనైతికమని ఆయన అన్నారు.

ఇటీవలి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్నూలు ఎంపి బుట్టా రేణుక కూడా టిడిపిలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బుట్ట రేణుక భర్త టిడిపిలో చేరారు.
చంద్రబాబుకు నిద్రపట్టడం లేదు: భూమన
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు నిద్రపట్టడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కుట్రలు, కుతంత్రాలు మాని ప్రజల సంక్షేమంపై దృష్టి సారించాలని చంద్రబాబుకు సూచించారు.












Click it and Unblock the Notifications