చంద్రబాబుకు స్వల్ప అస్వస్థత: జైల్లో ఫ్యాన్ కూడా లేదా?, ఆందోళనలో కుటుంబసభ్యులు
రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు, ఉక్కపోత వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక గత కొద్ది రోజులుగా రాజమహేంద్రవరంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఉక్కపోతతో డీహైడ్రేషన్‌కు గురయ్యారు.
చంద్రబాబు నాయుడు ఉంటున్న బ్లాక్‌లో ఫ్యాన్ కూడా లేకపోవడంతో ఆయన ఉక్కపోతకు గురయ్యారు. తాను డీహైడ్రేషన్ కు గురయ్యాననే విషయాన్ని చంద్రబాబు నాయుడు వైద్యాధికారికి కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయాలను మంగళవారం కుటుంబసభ్యులతో జరిగిన ములాఖత్‌లో చంద్రబాబు పంచుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు(Chandrababu)కు కల్పిస్తున్న సౌకర్యాలు, అందుతున్న వైద్యం పై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలని వైసీపీ ప్రభుత్వాన్ని హితవు పలుకుతున్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో వైసీపీని ఇంట్లో కూర్చోబెట్టడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే అధికారులు త్వరలో జైలుకు వెళ్లకతప్పదని హెచ్చరించారు.
ఇది ఇలావుండగా, చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో సీఐడీ తనపై నమోదు చేసిన కేసు అక్రమమని పేర్కొంటూ.. దాన్ని కొట్టివేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఇవాళ ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications