బాబుతో సిఎస్ భేటీ: రాజధానిపై కసరత్తు(పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పివి రమేష్, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు, సిఐఐ ప్రతినిధులు గురువారం సమావేశమయ్యారు. విభజన , ఉద్యోగ పంపిణీ, ఇతర కీలక అంశాలపై చంద్రబాబుకు సిఎస్ మహంతి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరణ ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మహంతి మాట్లాడుతూ.. కొత్త రాజధాని ఏర్పాటుపై కేంద్రం కమిటీని నియమించిందని, అదిసవివరమైన నివేదిక ఇవ్వనుందని వివరించారు. ముఖ్యమంత్రులు వారి కాన్వాయ్‌లోకి పూర్తిగా కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి అవసరమైన నిధులు ఇప్పటికే మంజూరయ్యాయని తెలిపారు.
అనంతరం ఉన్నతాధికారులతో మాట్లాడిన చంద్రబాబు టిడిపి మేనిఫెస్టో అమలుకు తోడ్పాటు అందించాలని కోరారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాగా పనిచేశారని అధికారలకు చంద్రబాబు కితాబిచ్చారు. అయితే ఆ ఫలితాలను రాజకీయంగా ఉపయోగించుకోలేకపోయామని వివరణ ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర సహకారం కూడా ఉంటుందని, అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో చేయాల్సిన అభివృద్ధి గురించి పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థిరపడి.. అక్కడి నుంచే పాలన సాగించేలా చూడాలన్నారు. విభజన ప్రక్రియ ఇతర ఏర్పాట్లపై మరింత లోతుగా వివరించాలనీ, దీని కోసం శుక్రవారం మరోసారి రావాలని చంద్రబాబు అధికారులతో అన్నట్లు తెలిసింది. సచివాలయం, శాసనసభ, ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు, ఉద్యోగులు తదితర పంపకం గురించిన వివరాలు అధికారులు చంద్రబాబుకు వివరించారు.

ఉన్నతాధికారులతో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పివి రమేష్, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు, సిఐఐ ప్రతినిధులు గురువారం సమావేశమయ్యారు.

ఉన్నతాధికారులతో చంద్రబాబు
విభజన, ఉద్యోగ పంపిణీ, ఇతర కీలక అంశాలపై చంద్రబాబుకు సిఎస్ మహంతి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరణ ఇచ్చారు.

ఉన్నతాధికారులతో చంద్రబాబు
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మహంతి మాట్లాడుతూ.. కొత్త రాజధాని ఏర్పాటుపై కేంద్రం కమిటీని నియమించిందని, అదిసవివరమైన నివేదిక ఇవ్వనుందని వివరించారు.

ఉన్నతాధికారులతో చంద్రబాబు
ముఖ్యమంత్రులు వారి కాన్వాయ్‌లోకి పూర్తిగా కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి అవసరమైన నిధులు ఇప్పటికే మంజూరయ్యాయని సిఎస్ తెలిపారు.

ఉన్నతాధికారులతో చంద్రబాబు
అనంతరం ఉన్నతాధికారులతో మాట్లాడిన చంద్రబాబు టిడిపి మేనిఫెస్టో అమలుకు తోడ్పాటు అందించాలని కోరారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాగా పనిచేశారని అధికారలకు చంద్రబాబు కితాబిచ్చారు.

ఉన్నతాధికారులతో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో చేయాల్సిన అభివృద్ధి గురించి పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థిరపడి.. అక్కడి నుంచే పాలన సాగించేలా చూడాలన్నారు.












Click it and Unblock the Notifications