రంగంలో దిగిన వైఎస్ జగన్

YS Jagan Mohan Reddy: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత.. దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల యథేచ్ఛగా ట్యాంపరింగ్ చేశారని, వాటిల్లో రికార్డయిన ఫలితాలను తారుమారు చేశారంటూ ప్రతి రోజూ వార్తలు వస్తోన్నాయి.

దాదాపుగా 140కి పైగా లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా కంటే అధికంగా ఓట్లు పోల్ కావడాన్ని దీనికి నిదర్శనంగా చూపిస్తోన్నారు. సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్, కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్.. ఇప్పటికే ఈ అంశంపై గళం విప్పారు. ప్రశాంత్ భూషణ్ ఓ అడుగు ముందుకేసి న్యాయపోరాటానికీ సిద్ధపడుతున్నారు.

Democracy at Risk Former AP CM Jagan Pushes for Paper Ballots Over EVMs

ప్రత్యేకించి- ఏపీలో వెలువడిన ఫలితాలు రాష్ట్ర ప్రజలను ఆలోచింపజేస్తోన్నాయి. తాము వేసిన ఓట్లు ఏమైపోయాయి? అనేది వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే- రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంటామనే ధీమాతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావడం దీనికి ప్రధాన కారణం.

అనేక నియోజకవర్గాల్లో వేల కొద్దీ ఓట్ల తేడాతో ఓడిపోయారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. 120కి పైగా అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు 50 వేలకు పైగా ఓట్లు పోల్ కావడం అసాధ్యం అనే అభిప్రాయ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. పోలింగ్ ముందు వరకూ ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీపై వ్యతిరేకత లేదని ఆ పార్టీ నాయకులు సైతం తేల్చి చెబుతున్నారు.

ఈవీఎంలను హ్యాక్ చేయడం, వాటిని మార్చేయడం లేదా, మానిప్యులేట్ వల్లే ఏపీలో ఫలితాలు తారుమారు అయ్యాయనే వాదనలు లేకపోలేదు. ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ నియోజకవర్గంలో షిండే వర్గానికి చెందిన శివసేన అభ్యర్థి రవీంద్ర వైకర్ వ్యవహారం సైతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

సోషల్ మీడియా జెయింట్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సైతం ఈవీఓ సంచలన ట్వీట్ చేశారు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చనీ తెలిపారు. మనుషుల ద్వారా లేదా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయినా ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యపడుతుందని చెప్పారు. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ పరిణామాలపై తాజాగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈవీఎంల పనితీరుపై అనుమానాలను వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఈవీఎంలపై స్పందించడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

న్యాయం జరగడం మాత్రమే కాదు.. అది జరిగినట్లు కనిపించాల్సిన అవసరం కూడా ఉందని జగన్ వ్యాఖ్యానించారు. అదే విధంగా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే.. అది బలంగా కనిపించాల్సిందేనని చెప్పారు.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా ప్రతి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్యం దేశంలో కూడా ఎన్నికల ప్రక్రియలో పేపర్ బ్యాలెట్లను ఉపయోగిస్తోన్నారని జగన్ గుర్తు చేశారు. అలాంటి దేశాల్లో ఈవీఎంలను వినియోగించట్లేదని చెప్పారు. మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో భాగంగా ఈవీఎంలకు బదులుగా ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లను ఉపయోగించే బాటలో సాగుదామని పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+