విజయవాడ ,గుంటూరు ప్రజలకు ముఖ్య గమనిక
ఏపీలో రైలు ప్రయాణికులకు ప్రధాన గమనిక.. గతంలో ఆగిపోయిన డెము రైళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. సిగ్నలింగ్ ఆధునికీకరణ పనులు, రైల్వే ట్రాక్ పనులతోపాటు ఇతర నిర్వహణాపరమైన పనులు జరుగుతుండటంతో పదిరోజులుగా డెము రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఆ పనులన్నీ పూర్తికావడంతో ఇవి తిరిగి పట్టాలెక్కాయి. విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, నిడదవోల మధ్య ఇవి తిరుగుతాయి. గతంలో ఏ షెడ్యూల్ ప్రకారమైతే నడిచాయో ఆ షెడ్యూల్ ప్రకారమే నడుస్తాయని అధికారులు తెలియజేశారు. అలాగే నరసాపురం-భీమవరం మధ్య తిరిగే డెము రైళ్లు కూడా నడవనున్నాయి.
'గుంటూరు' కోసం ఎదురు చూపులు
నరసాపురం-గుంటూరు మధ్య తిరుగుతున్న ఫాస్ట్ ప్యాసింజర్ మాత్రం ఇంకా ప్రారంభం కాకపోవడంపై ప్రయాణికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఈనెల 31వ తేదీ నుంచి నడుపుతామని అధికారులు తెలిపారు. కొందరు ప్రయాణికులు గుంటూరు పాస్ట్ ప్యాసింజర్ రైలు కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. దీనివల్ల గుంటూరు, విజయవాడ మధ్య నిత్యం తిరిగే ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దేశవ్యాప్తంగా జరుగుతున్న పనులు
గతేడాది ఒడిసాలోని బాలసోర్ వద్ద జరిగిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో 300కు పైగా ప్రయాణికులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మళ్లీ అటువంటి సంఘటనలు జరగకూడదన్న ఉద్దేశంతో భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ఉన్న సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరిస్తోంది. ఇందులో భాగంగానే అన్ని రైల్వే డివిజన్లలో పనులు జరుగుతున్నాయి. రైళ్లు నడుస్తుండటంతో పనులకు ఆటంకం కలుగుతుందన్న ఉద్దేశంతో అధికారులు వాటిని రద్దు చేశారు. అయితే దీనివల్ల నిత్యం ప్రధాన నగరాల మధ్య తిరిగే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలస్యంగా అయినా తిప్పాలని అధికారులకు విన్నవించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications