అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ ఫోన్ కాల్ తో ఫ్రస్ట్రేషన్ లో జగన్ మంత్రి-మండలిలో వ్యాఖ్యలు అందుకే-జగన్ ను అడగలేంగా..

|
Google Oneindia TeluguNews

ఏపీలో జగన్ కేబినెట్ ప్రక్షాళన వ్యవహారం విపక్షాలతో పాటు సొంత పార్టీవైసీపీలో సైతం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పైకి అంతా గుంభనంగా కనిపిస్తున్నా లోలోపల మాత్రం కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురవుతున్న మంత్రుల్లో ఒత్తిడి కనిపిస్తోంది. అసలే మంత్రి పదవి కోల్పోతున్నామన్న బాధలో ఉన్నప్పుడు ఓ మంత్రికి టీడీపీ నేత నుంచి కాల్ వచ్చింది. అది కాస్తా ఆయన ఫ్రస్ట్రేషన్ కు దారి తీసింది. చివరికి ఏం జరిగిందో తెలిస్తే అంతా షాక్ కావడం ఖాయం.

జగన్ కేబినెట్ ప్రక్షాళన చిత్రాలు

జగన్ కేబినెట్ ప్రక్షాళన చిత్రాలు


ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలకు గతంలో ఇచ్చిన మాట ప్రకారం రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకున్నతర్వాత సీఎం జగన్ కేబినెట్ ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారు. అనివార్యంగా కేబినెట్ లో మూడోవంతు మంత్రులను సాగనంపబోతున్నారు. ఇందులో ఎవరెవరు ఉండబోతున్నారనే అంశం ఇప్పటికే సదరు మంత్రులకు తెలిసిపోయింది కూడా. తెలియని వారికి సైతం ప్రత్యర్ధిపార్టీ నేతలు, హితులు,సన్నిహితులు ఫోన్లు చేసి మరీ చెప్తున్నారట. దీంతో జగన్ కేబినెట్ నుంచి ఉద్వాసకు గురవడాన్ని వారు అవమానంగా ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.

డిప్యూటీ సీఎంకు టీడీపీ నేత ఫోన్ కాల్

డిప్యూటీ సీఎంకు టీడీపీ నేత ఫోన్ కాల్

ప్రస్తుతం జగన్ కేబినెట్ లో చిత్తూరు జిల్లా నుంచి డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణస్వామికి ఈ మధ్య ఓ ఫోన్ కాల్ వచ్చిందట. అదీ టీడీపీ నేత నుంచి కావడం ఇక్కడ మరో విశేషం. సదరు టీడీపీ నేత నారాయణ స్వామికి ఫోన్ చేసి మీరు త్వరలో జరిగే కేబినెట్ ప్రక్షాళనలో మంత్రి పదవి పొగొట్టుకోబోతున్నారటగా అని ప్రశ్నించాడు. దీంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. అసలే పదవి పోతుందన్న బాధలో ఉన్న తనకు ఫోన్ చేసి పదవి పోతుందటగా అని ప్రశ్నిస్తే ఆయనకే కాదు ఎవరికైనా ఎలా ఉంటుంది. సరిగ్గా అదే పరిస్ధితి ఆయనకు ఎదురైంది.

 ఫ్రస్ట్రేషన్ తో మండలిలో వ్యాఖ్యలు

ఫ్రస్ట్రేషన్ తో మండలిలో వ్యాఖ్యలు


తనకు ఓ టీడీపీ నేత ఫోన్ చేసి మరీ తన మంత్రి పదవి ఊడిపోతుందనే విషయాన్ని ప్రశ్నించడంతో ఫ్రస్ట్రేషన్ లో ఉన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. ఆ విషయాన్ని నేరుగా ఎవరికీ చెప్పకుండానే నిన్న శాసనమండలికి వచ్చారు. అక్కడ ఆయనకు సభలో లోకేష్ కనిపించారు. అప్పటికే లోకేష్ జంగారెడ్డి గూడెం మరణాలతో పాటు పెగాసస్ విషయంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో సదరు టీడీపీ నేతపై ఉన్న ఫ్రస్ట్రేషన్ తో నారాయణ స్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ ఆయనపై సభా హక్కుల నోటీసు ఇచ్చింది.

 కేబినెట్ నుంచి పోయే మంత్రుల కోసం టీడీపీ వెయిటింగ్ ?

కేబినెట్ నుంచి పోయే మంత్రుల కోసం టీడీపీ వెయిటింగ్ ?

అయితే మండలిలో తాను చేసిన అనుచిత వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆ తర్వాత బయటికి వచ్చి వివరణ ఇచ్చారు. తాను చేసిన అనుచిత వ్యాఖ్యలు తప్పేవని, అయితే అవి లోకేష్ ను ఉద్దేశించి కాదన్నారు. అయినా జగన్ కేబినెట్ లో నుంచి బయటికి పోయే మంత్రుల కోసం టీడీపీ వెయిట్ చేస్తోందని తెలిపారు. అందులో భాగంగానే తమపై విమర్శలు చేస్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు.

జగన్ ను అడగలేం కదా !

జగన్ ను అడగలేం కదా !

గతంలో వైసీపీ అధికారంలో చేపట్టిన తర్వాత పదవులు ఇచ్చినప్పుడు రెండున్నరేళ్ల తర్వాత మంత్రుల్ని మారుస్తామని జగన్ చెప్పారని, ఇప్పుడు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికితే వెళ్లిపోవాలి తప్ప ఎందుకని అడిగితే సమంజసంగా ఉండదని నారాయణ స్వామి తెలిపారు. దీన్ని కూడా రాజకీయం చేయాలని చంద్రబాబు చూస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. కల్తీ సారా పేరుతో జంగారెడ్డి గూడెం మరణాల్ని టీడీపీ రాజకీయం చేస్తోందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డి గూడెం మృతుల కుటుంబాలు సహజమరణాలే అని చెప్తున్నా చంద్రబాబు అక్కడికెళ్లి రాజకీయం చేస్తున్నారని డిప్యూటీ సీఎం ఆరోపించారు.

English summary
ap deputy cm narayan swamy made interesting comments on his frustration over jagan cabinet reshuffle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X