పిఠాపురంలో సీన్ ఛేంజ్ - పవన్ అనూహ్య నిర్ణయం..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో లెక్కలు మారుతున్నాయి. జనసేన ప్లీనరీ వేదికగా నాగబాబు చేసిన వ్యాఖ్యల తరువాత సమీకరణాల్లో మార్పు కనిపిస్తోంది. వర్మ మద్దతు దారులు జనసేన నేతల తీరు పైన ఆగ్రహంతో ఉన్నారు. రెండు పార్టీల మద్దతు దారుల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామా లతో పవన్ అలర్ట్ అయ్యారు. పిఠాపురం కేంద్రంగా తాజా పరిణామాల పైన సమీక్షించారు. వీటి పైన ఇంటలిజెన్స్ నివేదికలు కోరారు. కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు.
కీలక పరిణామాలు
పిఠాపురం లో పరిణామాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. పిఠాపురంలో పవన్ కోసం సీటు త్యాగం చేసి.. జనసేనాని గెలుపు కోసం పని చేసిన వర్మ గురించి తాజాగా పార్టీ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. టీడీపీ శ్రేణులకు ఈ వ్యాఖ్యలు ఆగ్రహం తెప్పించాయి. తాజాగా నియో జకవర్గ పరిధిలో ఒక కార్యక్రమానికి వర్మను ఆహ్వానించకపోవటం పైన టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ ను నిలదీసారు. వర్మ చెబితేనే పవన్ కు ఓటు వేసామని నినాదాలు చేసారు. ఇక, పిఠాపురం లో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాల పైన పవన్ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. నియోజకవర్గం పైన తాజాగా పవన్ సమీక్ష చేసారు. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

నివేదిక ఇవ్వండి
పిఠాపురం లో అభివృద్ధి పనుల పైన పవన్ సమీక్ష చేసారు. నియోజకవర్గంలో మంచినీటి సమస్య పైన ఆరా తీసారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే సమయంలో పిఠాపురంలో శాంతి భద్రతల పైన ప్రత్యేకంగా ఆరా తీసారు. పిఠాపురం పోలీసుల వ్యవహారాలపై మీడియాలో వచ్చిన కథనాలను ప్రస్తావించారు. పిఠాపురానికి సంబంధించి తన దృష్టికి వచ్చిన కొన్ని అంశాలను ఆయన పేషీ అధికారులకు వివరించారు. వీటి పైన జిల్లా పోలీసు యంత్రాంగానికి తెలియచేయాలని సూచించారు. దీంతో పాటుగా పిఠాపురం పరిధిలోనిని నాలుగు పోలీస్ స్టేషన్ల లో పరిస్థితులపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని పవన్ ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.
పవన్ ఆదేశాలతో
ఇకపై ప్రతివారం నియోజకవర్గ అభివృద్ధిపై రివ్యూ చేయాలని పవన్ నిర్ణయించారు. గతంలో ఇదే పిఠాపురం కేంద్రంగా పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పోలీసు వ్యవస్థ సక్రమంగా పని చేయని కారణంగా ప్రజలు తమను నిలదీస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను హోం శాఖ తీసుకుంటే పరిస్థితి మరో విధంగా ఉంటుందని హెచ్చరించారు. ఆ తరువాత సోషల్ మీడియా లో అనుచిత పోస్టులు చేస్తున్న వారిని పలువురిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఇప్పుడు పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ తో పాటుగా రాజకీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల పైన పవన్ ప్రత్యేకం గా ఆరా తీస్తున్నారు. నిఘా నివేదికల ఆధారంగా భవిష్యత్ నిర్ణయాలకు పవన్ సిద్దం అవుతు న్నారు. దీంతో, పవన్ తాజా కార్యాచరణ రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications