Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కన్నీళ్లు పెట్టుకున్న పవన్, లోకేశ్.. వీడియో వైరల్

వీర జవాన్ మురళీ నాయక్‌ అంత్యక్రియలకు రాష్ట్ర మంత్రులు తరలి వచ్చారు. ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు లోకేశ్, అనిత, సత్యప్రసాద్‌.. మురళీ నాయక్‌ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. పవన్ కల్యాణ్ ను చూడగానే మురళీ నాయక్ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆయన చెంత చేరింది. తీవ్ర భావోద్వేగంతో ఉన్న ఆ కుటుంబాన్ని పవన్ ఓదార్చారు. వాళ్లకు ధైర్య చెప్పారు. ఈ క్రమంలో పవన్ కూడా కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడి వారిని కలిచివేసింది.

మురళీ నాయక్ కుటుంబానికి 5 ఎకరాల భూమి, రూ. 50 లక్షల సాయం, 300 గజాల స్థలం, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అంతేకాక వ్యక్తిగతంగా జవాన్ కుటుంబానికి రూ. 25 లక్షలు సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు.

Deputy CM Pawan Kalyan Minister Lokesh Pay Tribute to Braveheart Murali Naik

మరోవైపు వీర జవాన్ మురళీ నాయక్‌ భౌతిక కాయానికి మంత్రి లోకేశ్ నివాళులు అర్పించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. మంత్రి లోకేశ్ సైతం ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతూ మురళీ నాయక్‌ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. నేడు అధికార లాంఛనాలతో మురళీ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

ఇక మురళీ నాయక్ భౌతిక కాయం తరలించే సమయంలో రాష్ట్ర మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. జవాన్ కు నివాళిగా జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి కూడలిలో వేల సంఖ్యలో ప్రజలు చేరుకుని పూలతో వీడ్కోలు పలికారు. మంత్రి సవిత పర్యవేక్షణలో ప్రజలు భారీ కాన్వాయ్‌గా ఏర్పడి, జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహిస్తూ భౌతికకాయాన్ని తరలించారు. దీంతో బెంగళూరు నుంచి కళ్లితండాకు 90 నిమిషాల ప్రయాణం 8 గంటలు పట్టింది.

మరోవైపు మురళీ నాయక్ భౌతికకాయానికి వైసీపీ నేతలు ఉషశ్రీ చరణ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీ అండ‌గా ఉంటుంద‌న్నారు. ఈనెల 13న వైఎస్ జ‌గ‌న్ కళ్లి తండాకు వచ్చి ముర‌ళీ నాయ‌క్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శిస్తార‌ని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+