ఏపీలో సోషల్ మీడియాపై ఉక్కుపాదం: అసెంబ్లీలో కొత్త బిల్లు?
Pawan Kalyan: రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది.. సోషల్ మీడియా. రాజకీయ వాతావరణం మొత్తం కొద్ది రోజులుగా దీని చుట్టే తిరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు, వాళ్లకు 41 ఏ కింద నోటీసులు ఇవ్వడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి.
తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుకు నిరసనగా అటు వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం ఎదురుదాడి చేస్తోంది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా బరిలో దిగారు. అరెస్టులపై ఘాటుగా స్పందించారు. వారికి అండగా ఉంటానంటూ ప్రకటించారు.

ఈ క్రమంలో పార్టీ తరపున ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను సైతం వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసింది. అక్రమ నిర్భంధాలకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు, వారికి భరోసా ఇవ్వడం, వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం ఈ టాస్క్‌ఫోర్స్ పని చేస్తుంది.
ఈ పరిస్థితుల మధ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓ ప్రతిపాదనను తెర మీదికి తీసుకొచ్చారు. సోషల్ మీడియా దూకుడుకు బ్రేకులు వసేలా కొత్తగా ఓ చట్టాన్ని తీసుకుని రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టాలని సూచించారు.
సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్లును సభలో ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. హోమ్ మంత్రిని సైతం వదలట్లేదని, మహిళ అని కూడా చూడకుండా ఆమెను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు వేస్తోన్నారని, శాడిస్టులుగా వ్యవహరిస్తోన్నారని పవన్ విమర్శించారు.

సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్ పూర్తిగా దుర్వినియోగమౌతోందని, ప్రమాదకర స్థాయికి చేరుకుందని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు, ప్రజలను భయపెట్టడానికి వాటిని ఉపయోగిస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో ఎంపీగా పనిచేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పట్ల వ్యవహరించిన తీరును పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.
ఎంపీగా పనిచేసిన రఘురామ కృష్ణంరాజు వంటి నాయకుడికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని పవన్ అన్నారు. ఈ సైబర్ బెదిరింపు ధోరణి ప్రజాస్వామ్యానికి హానికరమని, దీన్ని అడ్డుకోవడానికి సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.
-
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..!











Click it and Unblock the Notifications