‘భార్యా, బిడ్డలకే న్యాయం చేయలేదు.. పవన్ కళ్యాణ్ పార్టీని రద్దు చేయాలి! ’

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కిరణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా.. పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదని అన్నారు.

హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు అందక ప్రజలు ఆందోళన చెందుతుంటే.. పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. ప్రజలంతా పవన్ కళ్యాణ్.. ఎక్కడున్నాడని ప్రశ్నిస్తున్నారని చెప్పారు.

Derangula Uday fires at Pawan Kalyan

ప్రజలకు న్యాయం జరగని పక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానంటూ పార్టీ ఆవిర్భావ సమయంలో గొప్పలు చెప్పిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంపై పల్లెత్తు మాటైనా అనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా ఉన్నందున జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ రద్దు చేయాలని ఉదయ్ కిరణ్ డిమాండ్ చేశారు. కట్టుకున్న భార్యకు, పుట్టిన బిడ్డకు న్యాయం చేయని పవన్.. ప్రజలకు ఏమి చేస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh BC Association president Derangula Uday Kiran fired at Jana Sena Party president Pawan Kalyan.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి