విజయసాయిని బూట్లు నాకేందుకు రాజ్యసభకు పంపించావా: జగన్‌పై దేవినేని
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయడానికి అంటూ వైయస్సార్ కాంగ్రెస్ రాజీనామాల డ్రామా ఆడుతోందని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు శుక్రవారం మండిపడ్డారు.
నాడు ప్రతిపక్షంలో ఉన్న తాము ప్రాణాలకు తెగించి మరి సమైక్యాంధ్ర ఉద్యమం చేశామని, నాటి ప్రధాని మన్మోహన్, సోనియా నివాసాల వద్ద కు వెళ్లి నిరసన వ్యక్తం చేశామన్నారు.

జగన్ నువ్వేం చేశావ్, నీ దళారి విజయసాయి రెడ్డి బూట్లు నాకుతున్నాడు, బూట్లు నాకేందుకా ఆయనను రాజ్యసభకు పంపించింది, ఈ దళారీ పనులు ప్రజలకు తెలియవని అనుకుంటున్నారా, ఎవరి కాళ్ల మీద పడుతున్నారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఏం చేస్తున్నారని మండిపడ్డారు.
మీ రాజీనామా డ్రామాల విషయం ప్రజలకు తెలుసునని చెప్పారు. నాయకులను కించపరిచేలా మాట్లాడుతున్న జగన్‌కు ప్రజాస్వామ్య పద్ధతిలో తగిన సమాధానం చెబుతామన్నారు.అని అన్నారు.
బీజేపీపై నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం
ప్రజలు ఏం తినాలో బీజేపీ వాళ్లే చెబుతున్నారని, ఆవు మాంసం తిన్న వాళ్లను చంపించిన ఘనత ఆ పార్టీదేనని మంత్రి నక్కా ఆనందబాబు వేరుగా విమర్శించారు. దేశ రక్షణను కాపాడాల్సిన నిఘా వ్యవస్థను కూడా బీజేపీ ప్రభుత్వం రాజకీయ అవసరాలకు వాడుకుంటోందన్నారు.
న్యాయ, పార్లమెంట్ వ్యవస్థలను కేంద్రం భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. ఏపీ ప్రయోజనాల కోసం పాటుపడుతున్న చంద్రబాబుకు ప్రజలు అండగా నిలవాలని, ఏపీకి న్యాయం చేసే వరకు కేంద్రంపై తమ పోరాటం ఆగదన్నారు.












Click it and Unblock the Notifications