జగన్ పైన ఉమ నిప్పులు
జగన్ పైన ఉమ నిప్పులు
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ..తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా పేదల సొమ్మును కాజేశావు.. దొంగ ఎప్పటికీ దొర కాలేడు.. ఆర్థిక నేరాల కేసుల్లో ఇరుక్కుని రోజూ కోర్టుల చుట్టూ తిరిగే నీవా చంద్రబాబును విమర్శించేది అని మంత్రి ధ్వజమెత్తారు. నిడమానూరు ఘటనలో కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం ఎవరిదో త్వరలోనే తేలుతుంది. ఎవరైనా నష్టం కలిగించాలంటే కొత్త కారు తగలబెడతారు.. కానీ పక్కనే ఉన్న పాత కారు తగలబెట్టడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. పేదవాడి కారు తగలబెట్టాల్సిన అవసరం టీడీపీకి లేదు. ఇందులో ఎవరి పాత్ర ఉందో అన్నీ బయటపడతాయి. పులివెందుల ఫ్యాక్షన్ రాజకీయాలు ఇక్కడ పనిచేయవు. జగన్.. రాసిపెట్టుకో.. తొక్కి నార తీస్తామని ఉమ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications