ఉద్యోగులకు సమగ్ర వేతన ప్యాకేజీ, ప్రభుత్వం నిర్ణయం - రూ1.50కోట్ల భీమా, ప్రత్యేక రుణాలు..!!
ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉద్యోగుల అంశాల పైన కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు పలు నిర్ణయాలను ప్రతిపాదించాయి. సంక్రాంతి వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉద్యోగుల బకాయిలను కొంత మేర విడుదల చేసాయి. కాగా, 8వ వేతన సంఘం సిఫార్సుల పైన ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో ఉద్యోగులకు సమగ్ర వేతన ప్యాకేజీ ఖాతాను అందుబాటులోకి తీసుకొచ్చారు.
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. ఉద్యోగులకు సమగ్ర వేతన ప్యాకేజీ ఖాతాను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్థిక సేవల విభాగం బుధవారం ఈ ప్రత్యేక ఖాతాను ప్రారంభించింది. ఈ విధానంతో ఇక నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకే ఖాతా ద్వారా బ్యాంకింగ్, బీమా, కార్డుల సేవలు సమగ్రంగా అందుతాయి. అదే విధంగా ఈ ప్యాకేజీ ద్వారా కేంద్ర ఉద్యోగులకు ఆర్థిక, సామాజిక భద్రత మెరుగుపడుతుందని ఆర్థిక సేవల శాఖ వెల్లడించింది. అన్ని క్యాడర్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్ఠ కవరేజీ, ఏకరూపత, విస్తృత సౌకర్యాలు కల్పించేందుకు గాను బ్యాంకులతో సంప్రదింపులు జరిపి చాలా జాగ్రత్తగా ప్యాకేజీలను పొందించినట్లు ప్రకటించింది. దీని ద్వారా రూ 1.50 కోట్ల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా, రూ.2 కోట్ల దాకా గగనతల ప్రమాద భీమా, మెరుగుపరిచిన సౌకర్యాలతో కూడిన జీరో బ్యాలెన్స్ వేతన ఖాతా, గృహ, విద్య, వాహన, వ్యక్తిగత రుణాలకు తక్కువ వడ్డీ కే ఉద్యోగులకు అందించే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు.

అదే విధంగా కార్డులకు సంబంధించి ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, రివార్డ్ ప్రోగ్రామ్‌లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, అపరిమిత లావాదేవీలు, నిర్వహణ చార్జీలు లేకపోవడం వంటి సౌకర్యాలు ఉంటాయని వివరించారు. ఆయా సదుపాయాలపై ప్రభుత్వరంగ బ్యాంకులు విస్తృతంగా ప్రచారం చేయాలని, ఉద్యోగులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఉద్యోగుల అనుమతితో ప్రస్తుత ఖాతాల నుంచి కొత్త ప్యాకేజీకి మారేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీని ద్వారా ఉద్యోగులకు ప్రయోజనం కలిగనుందని అధికారులు చెబుతున్నారు. బ్యాంకింగ్ సదుపాయాలను మరింత ఉద్యోగులకు ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వాలు సంప్రదింపులు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉద్యోగులకు కోటి రూపాయల మేర భీమా సౌకర్యం కల్పించాయి. ఇదే సమయంలో కేంద్రంతోల 8వ వేతన సంఘం.. తెలుగు రాష్ట్రాల్లో పీఆర్సీ కోసం ఉద్యోగులు వేచి చూస్తున్నారు. దీని పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
-
మరో మూడు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications