మలుపు వద్ద వేగం వల్లే ప్రమాదం, దివాకర్ ట్రావెల్స్‌పై కేసు: డీజీపీ
కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ డీజీపీ సాంబశివ రావు మంగళవారం నాడు స్పందించారు. మలుపు వద్ద బస్సును వేగంగా నడపడం వల్లనే ప్రమాదం జరిగిందన్నారు.
విజయవాడ: కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ డీజీపీ సాంబశివ రావు మంగళవారం నాడు స్పందించారు. మలుపు వద్ద బస్సును వేగంగా నడపడం వల్లనే ప్రమాదం జరిగిందన్నారు.
రహదారి డిజైన్లలో లోపాలు ఉన్నాయో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. బస్సు యాజమాన్యం దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
ప్రమాదానికి గురైన బస్సుకు ఫిట్‌నెస్ ధ్రువపత్రం ఉన్నట్లు రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.

మరోవైపు, బస్సు ప్రమాద బాధితులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పరామర్శించారు. బస్సు ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విశాఖ నుంచి విజయవాడకు చేరుకున్నారు.
కొత్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కామినేని పరామర్శించారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించిందని, చంద్రన్న బీమా వర్తించే వారికి రూ.5లక్షలు, వర్తించని వారికి రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామన్నారు.












Click it and Unblock the Notifications