తిరుపతిలో ధనుష్, నాగార్జున సినిమా షూటింగ్... ఇబ్బందుల్లో భక్తులు...
తిరుమలలో ధనుష్, నాగార్జున సినిమా షూటింగ్ ప్రారంభమైంది. దీంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధనుష్, నాగార్జునతో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభమైంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తిరుపతిలోని అలిపిరి దగ్గర ధనుష్ తో షూటింగ్ జరుగుతుంది.
ఇవాళ ఉదయం నుంచే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. దాంతో అలిపిరి దగ్గర భారీ ట్రాఫిక్ మొదలైంది. సినిమా షూటింగ్, తిరుమల వెళ్లే భక్తులతో అలిపిరి దగ్గర తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో స్థానికులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పొలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వెంటనే అలిపిరిదగ్గర ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడి స్థానికులు కొందరు పోలీసులతో గొడవకు దిగడం జరిగింది. ధనుష్, నాగార్జున కాంబోలో వస్తున్న ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్- శేఖర్ కమ్ముల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం.

షూటింగ్‌కు ముందుగానే అనుమతి తీసుకున్న చిత్ర యూనిట్ : ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఇటీవలే పూర్తిచేసుకున్నారు. అనంతరం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇక, ఈ చిత్ర షూటింగ్ అలిపిరి వద్ద నేటి ఉదయం జరిగింది. షూటింగ్ జరిగింది కాసేపు అయినా అక్కడ మాత్రం ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో తిరుమల కొండపై వెళ్లే భక్తులకు తీవ్ర అటంకం ఏర్పడింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరుమల కొండపైకి వాహనాల్లో వెళ్లాలంటే అలిపిరి మీదుగానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రదేశమంతా ఎల్లప్పుడూ భక్తులతో రద్దీగా నే ఉంటుంది. ఇలాంటి ప్రదేశంలో షూటింగ్ పెట్టడంతో కాస్త చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంతంలో షూటింగ్ కోసం చిత్ర యూనిట్ ముందుగానే అనుమతి తీసుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications