తెరాసలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే చంద్రబాబుని పొగిడారు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన వరంగల్ జిల్లా ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఆదివారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నా, టీడీపీ అన్నా గౌరవమే అని చెప్పారు.
అయితే, తమ ప్రాంతమైన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసమే తాను తెరాసలో చేరుతున్నానని చెప్పారు. చంద్రబాబు తమ ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ కోసం అహర్నిషలు కష్టపడుతున్నారని కితాబిచ్చారు. అలాగే తాను తెలంగాణ అభివృద్ధి కోసం కారు ఎక్కినట్లు చెప్పారు. బంగారు తెలంగాణ కోసమే పార్టీ మారానన్నారు.
తాను అన్నింటిని ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలనే పట్టుదల, ఆకాంక్ష లేదని విమర్శించారు. వారు ప్యాకేజీలు తీసుకొని ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రభుత్వాన్ని తిట్టేందుకు వారు ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీలో ఉన్న తెలంగాణ నేతలు చంద్రబాబు మోచేతి నీల్లు తాగుతున్నారన్నారు. తెలంగాణలో కరెంట్ కష్టాలకు ఏపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కేసీఆఱ్ నాయకత్వంలో పరకాల నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని చెప్పారు.
అబద్దాలతో సాగుతోంది: షబ్బీర్ అలీ
తెరాస ప్రభుత్వం పూర్తిగా అబద్దాలతో సాగుతోందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ వేరుగా మండిపడ్డారు. గాంధీ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ముస్లీం, గిరిజన రిజర్వేషన్ల పైన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోపించారు.
విద్యుత్ సమస్య ఉందని తెలిసీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తప్పుడు హామీలు ఇచ్చారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కేసీఆర్ చిత్తశుద్ధితో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని హితవు పలికారు. అబద్దాలు చెప్పడాన్ని కేసీఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు.
బంగారు టీ కోసమే, అ్నీ ఆలోచించాకే తెరాసలోకి, టీడీపీ బాబు అంటే గౌరవమే, తమ ప్రాంత అభివృద్ధి కోసం బాబు అహ్నిషలు కష్టపడుతున్నాడు, టీటీడీపీ నేతలకు టీ అబివృద్ధి కావాలనే పట్టుదల లేతు, ప్యాకేజీలు తీసుకొని విమర్శిస్తున్నారు,
టీడీపీ, బాబు అంటే గౌరవమే,












Click it and Unblock the Notifications