కేబినెట్ నిర్ణయం తిరస్కరించండి: రాష్ట్రపతికి ధర్మాన లేఖ

అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్రాన్ని విభజించడం సరికాదన్నారు. విభజనపై కేంద్ర కేబినేట్ నిర్ణయాన్ని తిరస్కరించాలని కోరారు. రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేసేలా మంత్రుల బృందానికి సూచించాలని ధర్మాన ప్రసాద రావు రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఆనం హల్‌చల్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తన ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన సమయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి తన వ్యక్తిగత తుపాకీని చేతిలో ఉంచుకుని రోడ్లపై తిరిగారట. సమైక్యాంధ్రను కోరుతూ జగన్ పార్టీ నాయకులు నెల్లూరులోని ఎమ్మెల్యేలు ఆనం వివేకా, శ్రీధర్ కృష్ణారెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఆనం ఇంటికి వెళ్లే నాలుగు దిక్కులనూ ఇనుప కంచెలతో మూసేశారు.
దీంతో, ఆయా ప్రాంతాల్లోని స్థానికులూ బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. రోడ్లను ఇనుప కంచెతో మూసివేయడంతో ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటి రోడ్లను మూయాల్సిన అవసరం ఏముందని, అవసరమైతే ముట్టడిస్తామన్న వారి ఇళ్ల రోడ్లను మూసివేయాలని సూచించారు. దీంతో పోలీసులు కంచెలను తొలగించారు. ఈ సందర్భంగా ఆనం వివేకా తన వ్యక్తిగత తుపాకీని ఓ కాగితంలో చుట్టుకుని రోడ్లపై తిరిగారట.












Click it and Unblock the Notifications