గేటు దగ్గరే చెప్పుతో కొడతా: Kethireddy సంచలన వార్నింగ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండి అధికారాన్ని అనుభవించి, కష్టకాలంలో పార్టీని వీడి కూటమి గూటికి చేరిన 'జంపింగ్ జిలానీల'పై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం ధర్మవరంలో జరిగిన వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.

పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పక్కకు తప్పుకున్న వారిని ఉద్దేశించి కేతిరెడ్డి అత్యంత ఘాటుగా స్పందించారు. "మన దగ్గర ఉండి సంపాదించుకుని, ఇప్పుడు పదవుల కోసం వెళ్లిన నాకొ**కులను మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదు. బంధుత్వాలు, స్నేహాల పేరుతో మళ్ళీ వైసీపీలోకి వస్తామంటే.. గేటు దగ్గరే వాళ్ల ముఖం మీద చెప్పు సైజు ముద్ర పడేలా కొడతాం" అంటూ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు.

Dharmavaram Politics Heats Up Kethireddy Blasts Characterless Leaders for Quitting YCP for Power

శత్రువునైనా నమ్ముతా కానీ.. Kethireddy

రాజకీయాల్లో నైతికత ఉండాలని చెప్తూ, వెన్నుపోటు పొడిచిన వారిపై ఆయన నిప్పులు చెరిగారు. "ఎదురుగా నిలబడి పోరాడే శత్రువునైనా గౌరవిస్తాం, అవసరమైతే పార్టీలోకి చేర్చుకుంటాం. కానీ, మన దగ్గరుండి దోచుకుని, పార్టీని ముంచేసి వెళ్లిన క్యారెక్టర్ లేని ఫెలోస్‌ను మాత్రం అసలు దగ్గరకు రానివ్వం. తొక్కలో రాజకీయాల కోసం వ్యక్తిత్వాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు" అని కార్యకర్తల ముందు కుండబద్దలు కొట్టారు.

నిజమైన కార్యకర్తలే నా బలం!

పార్టీ అధికారం కోల్పోయినా వెన్నంటి ఉన్న కార్యకర్తలకు కేతిరెడ్డి పూర్తి భరోసా ఇచ్చారు. పదవుల కోసం వెళ్లిన వారిని నమ్మే స్థితిలో పార్టీ లేదని, కేవలం విధేయులకే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. "రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యం.. ఆ క్యారెక్టర్ లేని వాళ్లకు వైసీపీ తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయి" అని ఆయన తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+