వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐక్యాంపస్ యాప్‌తో స్టూడెంట్ అప్‌డేట్స్: ఇక తల్లిదండ్రులకు నో టెన్షన్

విద్యార్థుల ఐడీ నంబర్ ఆధారంగా తల్లిదండ్రులు వాళ్ల పర్ఫామెన్స్‌ను తెలుసుకోవచ్చని సంస్థ ప్రతినిధి కృష్ణమణి చెప్పారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బిజీ షెడ్యూల్‌తో సాగిపోయే జీవితాల్లో పిల్లల చదువును పట్టించుకునే తీరిక లేని తల్లిదండ్రులకు శుభవార్త. స్కూల్, కళాశాలల్లో మీ పిల్లల పెర్ఫామెన్స్, అటెండెన్స్, హోం వర్క్స్, ఎగ్జామ్ షెడ్యూల్స్.. ఇలా ప్రతి ఒక్కటి మీ అరచేతిలో ఉన్న మొబైల్ స్క్రీన్ మీద దర్శనమిచ్చేలా ఇప్పుడో సరికొత్త యాప్ రూపుదిద్దుకుంది.

ధర్మీటెక్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ ఐక్యాంపస్ అనే సరికొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా పిల్లలకు సంబంధించిన స్కూల్ లేదా కాలేజీ అప్‌డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు చేరనున్నాయి. ధర్మీటెక్ సంస్థ వ్యవస్థాపకులు, సీఈవో కృష్టమణి ఐక్యాంపస్ యాప్ ప్రత్యేకతల గురించి మీడియాకు వివరించారు.

ఇప్పటికే నగరంలోని పలు స్కూల్ యాజమాన్యాలతో ధర్మీటెక్ సొల్యూషన్స్ సంస్థ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా కృష్ణమణి తెలిపారు. కళాశాల కార్యక్రమాలతో పాటు నోటీస్ బోర్డు వ్యూస్, హోం వర్క్, ఫ్యాకల్టీ సమాచారం, సెమిస్టర్ ఫలితాలు, రిక్రూట్ మెంట్ డ్రైవ్స్, సర్య్యులర్స్.. ఇలా ప్రతీ విషయాన్ని తల్లిదండ్రులు ఈ యాప్ ద్వారా పర్యవేక్షించవచ్చు.

Dharmi tech solutions introduced a new app for student updates

ఐక్యాంపస్ యాప్ ఉపయోగించడం ద్వారా పిల్లల చదువుల పట్ల తల్లిదండ్రులు 'టెన్షన్ ఫ్రీ'గా ఉండవచ్చునని కృష్ణమణి తెలిపారు.

స్కూల్/కాలేజీ బస్సుల సమాచారం కూడా:

పొద్దున్నే పిల్లలను రెడీ చేసి స్కూల్ బస్ కోసం రోడ్ల మీద పడిగాపులు కాచే తల్లిదండ్రులు చాలామందే ఉంటారు. ఇదే తంతు సాయంత్రం కూడా కొనసాగుతుంది. స్కూల్ బస్ కొంచెం లేటైనా.. పిల్లలు ఇంకా రాలేదే అని పేరెంట్స్ కంగారు పడిపోతుంటారు.

సరిగ్గా ఇదే పాయింట్ మీద ఫోకస్ చేసిన ధర్మీటెక్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. తల్లిదండ్రుల కష్టాలను తీర్చడానికి 'ట్రాన్స్‌పోర్టేషన్ కమ్యూట్ సర్వీసెస్'( ట్రాన్స్‌పోర్టేషన్) అనే యాప్‌ను రూపొందించింది.

నేవిగేషన్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఈ యాప్ ద్వారా స్కూల్ లేదా కాలేజీ బస్ 'రూట్ మ్యాప్' వివరాలు మెసేజ్ అలర్ట్ రూపంలో తల్లిదండ్రులకు చేరుతాయి. తద్వారా బస్ ఏ సమయంలో.. ఏ రూట్ లో ఉంది?.. పిల్లలు ఏ సమయానికి ఇంటికి చేరుకుంటారు? వంటి కచ్చితమైన సమాచారం తల్లిదండ్రులకు మెసేజ్ రూపంలో ఎప్పటికప్పుడు చేరుతుంది.

బస్ ట్రాకింగ్ ద్వారా తల్లిదండ్రులకు లైవ్లీ అప్‌డేట్స్ చేరిపోతాయి. ధర్మీటెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న స్కూల్స్ కు ఈ యాప్‌ను విక్రయిస్తున్నారు. యాప్ పర్యవేక్షణ మొత్తం స్కూల్ యాజమాన్యాల పరిధిలోనే ఉంటుంది. దీని వినియోగం ద్వారా అటు తల్లిదండ్రులు, ఇటు స్కూల్ యాజమాన్యాలు విద్యార్థుల భద్రతకు సంబంధించి నిశ్చింతగా ఉండవచ్చునని సంస్థ సీఈవో కృష్ణమణి తెలియజేశారు.

English summary
Dharmi tech solutions was introduced a new app for student lively updates. It will helps to parents to know students performence, attendance in school or college
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X