వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి డీఎన్ఏ పరీక్షలు చెయ్యాలి, నా భార్యను మోసం చేసి ?
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో వైసీపీ నాయకులు ధర్నా చేసిన విషయం తెలిసిందే ఇదే సమయంలో వైసీపీ నెంబర్ టూ, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని, ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నా నిర్వహించడం హాట్ టాపిక్ అయ్యింది.
సస్పెండ్ కు గురైన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ పూర్వపు సహాయక కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్,తో పాటు గిరిజన బహుజన సంఘాలు, దిళిత సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ సందర్బంగా శాంతి భర్త మదన్ మోహన్ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. గిరిజన కుటుంబానికి అన్యాయం చేసిన విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చెయ్యాలని, ఆయన్ను వైసీపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఇదే సందర్బంలో శాంతి భర్త మదన్ మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్య శాంతిని నమ్మించి మోసం చేసిన విజయసాయి రెడ్డి ఓ బిడ్డకు తండ్రి అయ్యాడని, నా భార్య శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో నిర్దారించడానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి డీఎన్ఏ పరీక్షల నిర్వహించాలని డిమాండ్ చేశారు. తన భార్య శాంతి అధికారం అడ్డం పెట్టుకున్న విజయసాయి రెడ్డి సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన దేవాదాయ శాఖ భూములు ఖబ్జా చేశారని మదన్ మోహన్ ఆరోపించారు.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, పోతిరెడ్డి సుభాష రెడ్డి కలిసి తన భార్య శాంతిని గుప్పెట్లో పెట్టుకున్నారని, దేవాదాయ శాఖకు చెందిన వెయ్యి కోట్ల రూపాయాల విలువైన భూములను కబ్జా చేశారని, తన భార్య అధికారాన్ని వీళ్లు అడ్డం పెట్టుకుని దేవాదాయ శాఖ ఆస్తులను లూటీ చేశారని శాంతి భర్త మదన్ మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను విదేశాల్లో ఉన్న సమయంలోనే తన భార్య శాంతి బిడ్డకు తల్లి అయ్యిందని మదన్ మోహన్ ఆరోపించారు.

శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయం ఈ ప్రపంచానికి తెలియాలని, నా భార్యకు పుట్టిన బిడ్డకు నేను మాత్రం తండ్రి కాదని మదన్ మోహన్ అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉంటున్న విజయసాయి రెడ్డి గిరిజనులను మోసం చేశారని, నా కుటుంబాన్ని నాశనం చేశాడని, ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సస్పెండ్ కు గురైన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ డిమాండ్ చేశారు.
తన భార్య శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి నేను కాదని చెబుతున్న విజయసాయి రెడ్డి ఆయన తప్పు చెయ్యకపోతే డీఎన్ఏ పరీక్షలు చేసుకోవడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారని శాంతి భర్త మదన్ మోహన్ పశ్నించారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చెయ్యాలని రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ లను కలిసి మనవి చేస్తామని శాంతి భర్త మదన్ మోహన్, మాజీ జడ్జి రామక్రిష్ణ మీడియాకు చెప్పారు. మాజీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నాయులు ధర్నా చేస్తున్న ప్రాంతంలోనే శాంతి భర్త మదన్ మోహన్ తో పాటు దళిత, గిరిజన సంఘాలు ధర్నా చెయ్యడం ఇప్పుడు ఢిల్లీలో కూడా హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications