వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధర్నా: ఇక్కడ చింతమనేని, అక్కడ వెంకటరమణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Dharnas: Chitamaneni at Eluru, Venkataramana at Tirupathi
ఏలూరు/ తిరుపతి : ఎన్నికల విధుల్లో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని తెలుగుదేశం పార్టీ నేత చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆ పార్టీ కార్యకర్తలు గురువారం ఆందోళనకు దిగారు. చింతమనేని స్టేషన్‌లోనే బైఠాయించి నిరసన తెలిపారు. పెదవేగి మండలం రాయన్నపాలెంలో అదుపులోకి తీసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను విడిచిపెట్టాలని వారు డిమాండ్ చేశారు.

బుధవారంనాడు పోలింగ్ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావుపై దాడి కేసులో కొందరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. టిడిపి కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ చింతమనేని ధర్నాకు దిగారు.

ఇదిలావుంటే, తిరుపతి నగరంలోని పూలే విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి వెంకటరమణ గురువారం ఉదయం మౌనదీక్షకు దిగారు. తనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కరుణాకర్‌రెడ్డి దాడి చేశారని నిరసనగా వెంకటరమణ మౌనదీక్ష చేపట్టారు.

ఎన్నికల సందర్భంగా బుధవారం సాయంత్రం వెంకటరమణపై భూమన కరుణాకర్ రెడ్డి దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గొడవ నేపథ్యంలో ఇరువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని రెండు గంటల తర్వాత వదిలేశారు. గురువారం ఉదయం తన అనుచరులతో దీక్ష చేసిన వెంకటరమణ ఆ తర్వాత ఎన్టీఆర్ విగ్రహం వరకు పాదయాత్ర చేశారు

English summary
TDP leader Chintamamaneni Prabhakar staged dharna in front of PS in West Godavari district. Meanwhile, Telugudesam party candidate Venkataramana staged dharna at Phule statue in Tirupathi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X