వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు సరికొత్త ప్లాన్: అధికారులే మీరిచ్చిన లంచం ఇంటికి తెచ్చిస్తారు

ఇటీవలి కాలంలో ప్రభుత్వం పనుల కోసం మీరు అధికారులకు లంచం ఇచ్చారా? అయితే ఇప్పుడు 1100కు డయల్ చేసి విషయం చెప్పండి.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఇటీవలి కాలంలో ప్రభుత్వం పనుల కోసం మీరు అధికారులకు లంచం ఇచ్చారా? అయితే ఇప్పుడు 1100కు డయల్ చేసి విషయం చెప్పండి. అప్పుడు మీరు ఎవరికైతే లంచం ఇచ్చారో అదే అధికారి మీ ఇంటికి వచ్చి మీరు ఇచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేయొచ్చు.

<strong>విభజనపై ఏ ఒక్కరూ నోరుమెదపలేదు, హైద్రాబాద్ పై బాబు ఆసక్తికరం</strong>విభజనపై ఏ ఒక్కరూ నోరుమెదపలేదు, హైద్రాబాద్ పై బాబు ఆసక్తికరం

ఏపీలో గత నెలలో ప్రారంభించిన పీపుల్ ఫస్ట్ కాల్ సెంటర్ అద్భుత ఫలితాలను ఇస్తోంది. అత్యంత అవినీతిమయ రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత ఏపీ రెండో స్థానంలో ఉన్నట్లు ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది.

చంద్రబాబు సరికొత్త ప్లాన్

చంద్రబాబు సరికొత్త ప్లాన్

దీంతో అవినీతిని రూపుమాపాలని కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సరికొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో 12 మంది అధికారులు తీసుకున్న లంచం సొమ్మును తిరిగి ఇచ్చేశారు.

లంచం డబ్బులు వెనక్కి

లంచం డబ్బులు వెనక్కి

పంచాయతీ కార్యదర్శి ఒకరు పదిమందికి లంచం డబ్బులను వెనక్కి ఇచ్చినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. మే 25 ప్రారంభించిన 1100 కాల్ సెంటర్‌కు విపరీతమైన ఆదరణ వస్తోందని తెలిపారు.

లంచం తిరిగిస్తున్నారని..

లంచం తిరిగిస్తున్నారని..

బాధితుల నుంచి కాల్ సెంటర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్టు అధికారులు తెలిపారు. తీసుకున్న లంచం డబ్బులను తిరిగి ఇచ్చేందుకు ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నట్టు ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వివరించారు.

ప్రతి విషయంలో వెనక్కి రాకపోవచ్చు

ప్రతి విషయంలో వెనక్కి రాకపోవచ్చు

రూ.500, రూ.1000 తీసుకున్న అధికారులు ఆ సొమ్మును తిరిగి ఇచ్చేస్తున్నా వారిని గుర్తిస్తున్న ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అయితే ప్రతీ కేసు విషయంలో డబ్బులు తిరిగి వస్తాయని ప్రభుత్వం కచ్చితంగా చెప్పలేకపోతోంది.

English summary
If you had paid a bribe for availing of any government service in Andhra Pradesh in the recent days, just dial 1100 and report the matter. Chance is that the corrupt government servant, who fleeced you, may possibly come knocking on your door to return the amount.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X