వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రివర్స్: చంద్రబాబుపై ఛాన్స్ మిస్సయిన పవన్ కళ్యాణ్, నంద్యాల మౌనంపై మరో కోణం

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నంద్యాల ఉప ఎన్నికల్లో న్యూట్రల్‌గా ఉంటానని చెప్పి మంచి ఛాన్స్ మిస్సయ్యారా? అంటే అవుననే అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నంద్యాల ఉప ఎన్నికల్లో న్యూట్రల్‌గా ఉంటానని చెప్పి మంచి ఛాన్స్ మిస్సయ్యారా? అంటే అవుననే అంటున్నారు.

మా ప్రాంతాలకు వెళ్తామని ఎమ్మెల్యేలు, నంద్యాలకు వెళ్లాలని చంద్రబాబుమా ప్రాంతాలకు వెళ్తామని ఎమ్మెల్యేలు, నంద్యాలకు వెళ్లాలని చంద్రబాబు

అదే సమయంలో పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండటం వెనుక కారణాలు కూడా వెతుకుతున్నారు. ఉద్దేశ్య పూర్వకంగానే ఆయన మౌనం వహించారా అనే చర్చ ఇంకా కొనసాగుతోంది.

పవన్ కళ్యాణ్ ప్రకటన

పవన్ కళ్యాణ్ ప్రకటన

నంద్యాల ఉప ఎన్నికల్లో తాను ఎవరికీ మద్దతివ్వడం లేదని పవన్ కళ్యాణ్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు చెప్పారు. ఇది తెలుగుదేశం పార్టీకి షాకిచ్చిందనే చెప్పవచ్చు. పవన్ జత కలిస్తే భూమా బ్రహ్మానంద రెడ్డికి మరింత మెజార్టీ వచ్చేదని లెక్కలు వేసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ మౌనం వెనుక కారణాలు..

పవన్ కళ్యాణ్ మౌనం వెనుక కారణాలు..

నంద్యాల ఉప ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే టిడిపికి అనుకూలంగా ఉన్నాడనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మౌనంగా ఉండటమే మంచిదని ఆయన భావించి ఉంటారని అంటూన్నారు. 2019లో దాదాపు ఒంటరి పోరుకు సిద్ధమవుతున్న సమయంలో ఎవరికీ మద్దతివ్వకూడదని భావించి ఉంటారని అంటున్నారు.

ఇప్పుడు మరో కోణం

ఇప్పుడు మరో కోణం

అయితే, పవన్ కళ్యాణ్ మౌనం వెనుక మరో కారణం కూడా ఉండి ఉండవచ్చునని అంటున్నారు. ఉప ఎన్నికలకు ముందు టిడిపి వర్సెస్ వైసిపిగా ఉంది. అలాగే, చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నదనే వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో టిడిపి ఓడిపోయే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ భావించడం వల్లే మౌనం వహించి ఉండవచ్చునని అంటున్నారు.

ఛాన్స్ మిస్ చేసుకున్న పవన్ కళ్యాణ్

ఛాన్స్ మిస్ చేసుకున్న పవన్ కళ్యాణ్

గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి గెలుపు వెనుక పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారని ప్రతిపక్ష వైసిపి నిత్యం విమర్శలు చేస్తుంటుంది. ఇప్పుడు నంద్యాలలో పవన్ మద్దతు లేకుండా గెలిచారు. 2014లో పవన్ మద్దతుతో గెలిచినప్పటికీ.. ఇప్పుడు చంద్రబాబుపై విశ్వాసంతో ప్రజలు గెలిపించారని టిడిపికి మరింత గట్టిగా చెప్పుకునే అవకాశం కలిగిందని అంటున్నారు. అదే సమయంలో పవన్ మద్దతుతో టిడిపి గెలిచిందని చెప్పుకునే అవకాశాన్ని జనసేన అధినేత జారవిడుచుకున్నారని అంటున్నారు.

అఖిలప్రియ ఆసలు నీరుగారాయి

అఖిలప్రియ ఆసలు నీరుగారాయి

పవన్ కళ్యాణ్ తమకు మద్దతిస్తారని టిడిపి.. ముఖ్యంగా భూమా కుటుంబం ఎంతగానో ఆశలు పెట్టుకుంది. కానీ అఖిలప్రియ ఆశలను పవన్ కళ్యాణ్ నీరుగార్చారు. తమ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయని, పవన్ తమకు మద్దతిస్తారని వారు చెప్పారు. ఆయన తటస్థంగా ఉంటానని ప్రకటించిన అనంతరం కూడా ఆయన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

English summary
Jana Sena President Pawan Kalyan just before the Nandhyal By-Election had announced that his party is neutral in the election and is not supporting any party. Subsequently, TDP managed to win the election without the support of Jana Sena and BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X