రూ.6కోట్లు ఏపీ బెజవాడకు తరలించే యత్నం, అడ్డుకున్న తెలంగాణ
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఔషద మండలి (ఏపీ ఫార్మసీ కౌన్సెల్)లో నిధుల వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. ప్రస్తుతం హైదరాబాదులో మొజంజాహీ మార్కెట్ రోడ్డులోని భారతీయ స్టేట్ బ్యాంకులోని సంస్థ నిల్వ నిధులను విజయవాడ శాఖకు మార్చాలని కౌన్సెల్ ఇంఛార్జ్ లేఖ రాశారు.
దీంతో వివాదం ప్రారంభమైంది. బీ ఫార్మసీ, డీ ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులు ధ్రువపత్రాలను ఏపీపీసీలో నమోదు చేసుకుంటారు. అలా కొన్నేళ్లుగా రుసుము రూపేణా వసూలైన మొత్తం రూ.6.5 కోట్లు ఏపీసీసీ బ్యాంకు ఖాతాలో ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక కూడా దానికి అదికారికంగా ఔషద మండలి ఏర్పాటు కాకపోవడందతో నేటికీ ఏపీపీసీనే రెండు రాష్ట్రాల విద్యార్థుల ధ్రువపత్రాలను నమోదు చేసుకుంటోంది.
ఈ నేపథ్యంలో హైదరాబాదు బ్యాంకులో ఉన్న ఏపిపీసీ ఖాతాలోని నిల్వ నిధులను విజయవాడలోని బ్యాంకులోకి మార్చాలని ఈ నెల 26వవ తేదీన బ్యాంకు మేనేజర్‌కు లేఖ రాశారు. దీనిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పు బట్టింది.
కాగా, తెలంగాణ ఫార్మసీ కౌన్సెల్ ఏర్పాటుకు చేస్తూ ఈ మధ్యనే జీవో వచ్చింది. అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. దీంతో తెలంగాణ విద్యార్థులు ఏపీ కౌన్సెల్‌లోనే పేర్లు నమోదు చేసుకుంటున్నారు. కాబట్టి సాంకేతికంగా రెండు రాష్ట్రాలకు వేర్వేరు కౌన్సెళ్లు ఏర్పడనట్లే.












Click it and Unblock the Notifications