మారుతున్న టీడీపీ, జనసేన పొత్తు ముఖచిత్రం..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈ సారి ఎన్నికలు ప్రధాన పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. సీఎం జగన్ వై నాట్ 175 నినాదంతో అధికారం ఖాయమనే ధీమాతో ఉన్నారు. జగన్ ను ఓడించటమే లక్ష్యంగా పవన్ - చంద్రబాబు జత కట్టారు. బీజేపీ తమతో కలిసి రావాలని ఈ ఇద్దరు కోరుకుంటున్నా..ఆ పార్టీ నుంచి సానుకూల స్పందన లేదు. ఇదే సమయంలో క్షేత్ర స్థాయిలో మాత్రం ఈ రెండు పార్టీల పొత్తు ముఖచిత్రం స్పష్టంగా కనిపిస్తోందిజ
పొత్తులో ఏం జరుగుతోంది
ఏపీలో టీడీపీ - జనసేన పొత్తు ఖాయమైంది. రెండు పార్టీల అధినేతల మద్య సయోధ్య బాగానే ఉంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఎక్కడా కూడా రెండు పార్టీల మద్య క్యాడర్ పొసగడం లేదు. టీడీపీ నుండి సీటు ఆశీస్తున్న అభ్యర్ధుల మద్దుదారులు జనసేన కేడర్ తో కలవటం లేదు. టీడీపీతో సఖ్యత లేని వాళ్లని సహించేది లేదని చెప్పినా.. ఆ దిశగా కేడర్ లో ఐక్యత కనిపించటం లేదు. పొత్తు ప్రకటన తర్వాత జరిగిన వారాహి యాత్రలో రెండు పార్టీల మద్య సయోధ్య కుదరలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ రెండు పార్టీల ఓట్లు బదిలీ అవుతాయనేదే లేదా అనేది ఇపుడు పెద్ద సవాల్ గా మారుతోంది. రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకున్నపుడు సాధారణంగా బెనిఫిట్ పెద్ద పార్టీకి ఉంటుంది. లాభమంతా తెలుగుదేశానికే ఉంటుందనేది క్లియర్ గా కనిపిస్తుంది.

ముందస్తుగానే షెడ్యూల్
ఈ కారణంగానే జనసేన క్యాడర్ టీడీపీతో పొత్తు కోసం మనస్పూర్తిగా పని చేయటం లేదు. తెలంగాణలో ఫలితాల తరువాత జనసేనకు సీట్లు డిమాండ్ విషయంలో వాడి వేడి తగ్గింది. తొలుత 50 సీట్ల వరకు జనసేనకు పొత్తులో దక్కుతాయనే చర్చ సాగింది. కానీ, ఇప్పుడు జనసేనకు 20 సీట్ల వరకు పరిమితం చేయటానికి రంగం సిద్దమైందని తెలుస్తోంది. పవన్ సైతం ఇప్పటికే ప్రజల్లో..పార్టీలో టీడీపీతో పొత్తు.. చంద్రబాబు సీఎంగా కమిట్ అవ్వటంతో ఎన్ని సీట్లు ఇచ్చినా సర్దుకుపోయే ధోరణితోనే ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఇది జనసేన శ్రేణులకు రుచించటం లేదు. పవన్ సీఎం కావాలని తాము కోరుకుంటుంటే చంద్రబాబు కోసం పని చేయటం ఏంటనేది క్షేత్ర స్థాయిలో చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.
లెక్కలు తేలేదెన్నడు
అటు వారాహి యాత్రకు పవన్ బ్రేక్ ఇచ్చారు. లోకేశ్ యువగళం యాత్ర ఈ నెల 20న ముగియనుంది. యువగళం ముగింపు సభకు చంద్రబాబు - పవన్ హాజరు కానున్నారు. ఇద్దరు నేతలు కలిసి జిల్లాల్లో సభల్లో పాల్గొనాలని భావిస్తున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో పైనా ఇంకా స్పష్టత రాలేదు. అటు జగన్ అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. ఇటు రెండు పార్టీల్లోనూ సీట్ల పైనే క్లారిటీ లేదు. టీడీపీ ప్రకటించిన సంక్షేమ మేనిఫెస్టో కు ఆదరణ దక్కలేదు. అటు జగన్ తన సంక్షేమమే తనను గెలిపిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇంకా క్షేత్ర స్థాయిలో కేడర్ మధ్య అవగాహన కుదరలేదు. రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశాలు నిలిచి పోయాయి. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందని భావిస్తున్న వేళ ఈ రెండు పార్టీల పొత్తు తో ఎలాంటి ఫలితం వస్తుందనేది ఇంకా అస్పష్టంగానే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications