కేంద్రమంత్రి వర్సెస్ చైర్మన్: చొక్కాలు పట్టుకున్న నేతలు

ఇందులో భాగంగా నవంబర్ ఆరో తేదిన వరంగల్‌లో నిర్వహించనున్నారు. దీనిపై చర్చించేందుకు జిల్లా పార్టీ నాయకులు ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్రమంత్రి బలరాం నాయక్, డిసిసిబి చైర్మన్ జంగా రాఘవ రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగింది.
అది చినికి చినికి వానలా మారింది. ఓ సమయంలో రాఘవ రెడ్డి కేంద్రమంత్రి చొక్కా పట్టుకొని నెట్టేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో సమావేశాన్ని పొన్నాల లక్ష్మయ్య మధ్యలోనే ముగించారు.
కాగా, తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల చిరకాల వాంఛను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నెరవేర్చినందున గద్వాలలో మంగళవారం కృతజ్ఞత సభను ఏర్పాటు చేసినట్లు మంత్రి డికె అరుణ చెప్పారు.












Click it and Unblock the Notifications