ఇదేందయ్యా సామీ... ఏపీలో ఇట్టా ఉంది??
రాష్ట్రంలో చిత్రమైన వాతావరణం నెలకొంది. మొన్నటి వరకు భారీ వర్షాలు కురిగా.. ఇప్పుడు ఎండలు మళ్లీ మండిపోతున్నాయి. వేసవికాలంలో ఎండలు ఉన్నట్లుగా వర్షాకాలంలో ఎండలు ఉండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వర్షం కురవక.. ఉక్కపోత వాతావరణం వారికి చుక్కలు చూపిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా గొర్రెల మిట్టలో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
బాపట్ల, విశాఖపట్నం జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 3 డిగ్రీలు అదనంగా నమోదవుతున్నాయి. విజయనగరం జిల్లా అల్లాడపాలెంలో 39.79, నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 39.75, అన్నమయ్య జిల్లా శెట్టిగుంటలో 39.49, తిరుపతి జిల్లా సత్యవేడులో 39.28, పార్వతీపురం మన్యం జిల్లా పెదమేరంగిలో 39.13, చిత్తూరు జిల్లా కత్తెరపల్లిలో 39.09 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

కొన్ని జిల్లాల్లో ఎండలు మండిస్తుంటే మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో చిరుజల్లులు కురిశాయి. భారీగా వర్షాలు కురవాల్సిన ఆగస్టు నెలలో ఎండలు మండిపోతుండటంపై ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈనెల రెండోతేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఆ ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని భావించినప్పటికీ అందుకు వ్యతిరేకంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 25 కిలోల బియ్యం, పాలు, కిలో కూరగాయలు, కందిపప్పు, వంటనూనె లాంటి సరుకులను వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు అందించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఏటిగట్ల మీద ఉన్న వారికి పక్కా ఇళ్లను మంజూరు చేయాలని, ప్రమాదకర ప్రాంతాల్లో ఉండే వారికి రక్షిత ప్రాంతంలో ఇళ్లు ఇవ్వాలని.. పోలవరం ప్రాజెక్ట్ ఎగువన తరచూ ముంపు బారిన పడే ప్రాంతాలకు పునరావాస కార్యక్రమాల్లో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
పునరావాస శిబిరాల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లే సమయంలో ప్రతి కుటుంబానికి రూ.2వేల చొప్పున ఇవ్వాలన్నారు. తమకు సహాయం అందలేదని ఒక్క బాధిత కుటుంబం నుంచి కూడా ఫిర్యాదు రావడానికి వీల్లేదన్నారు.












Click it and Unblock the Notifications