టి నేతలకు డిగ్గీ హామీ: ఆంధ్రా, టి ఫీలింగ్ లేదని కాకా

 Diggy promises on two PCCs in AP
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రెండు పిసిసిలు ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల శాఖ మంత్రి దిగ్విజయ్ సింగ్ శుక్రవారం తనను కలిసిన తెలంగాణ ప్రాంత నేతలకు చెప్పారు. పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో టి నేతలు డిగ్గీని కలిశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవద్దని, రెండు పిసిసిలు ఏర్పాటు చేయాలని కోరారు. రెండు కొత్త పిసిసిలకు ఆయన ఓకే చెప్పారు.

హైదరాబాదులో భారీ బహిరంగ సభ

తెలంగాణ ఆకాంక్ష నెరవేరుతున్న నేపథ్యంలో త్వరలో హైదరాబాదులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు షబ్బీర్ అలీ, డికె అరుణ, వి హనుమంత రావు తదితరులు చెప్పారు. దిగ్విజయ్‌తో భేటీ అయిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

హైదరాబాదలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నామన్నారు. సభకు సోనియాను, రాహుల్ గాంధీని ఆహ్వానిస్తామన్నారు. కిరణ్ కుమార్ రెడ్డితో ఇద్దరు ముగ్గురు మినహా ఎవరు వెళ్లరన్నారు. అన్నదమ్ములుగా విడిపోయి, అందరం కలిసుందామన్నారు. వచ్చే ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయన్నారు.

సోనియా వల్లే: కాకా

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సోనియా గాంధీ వల్లే సాకారమైందని ఆ పార్టీ సీనియర్ నేత వెంకట స్వామి(కాకా) చెప్పారు. తెరాస విలీనంపై ఎన్నికలప్పుడు మాట్లాడుతామన్నారు. తాను చనిపోయే వరకు కాంగ్రెసు పార్టీలోనే ఉంటానని చెప్పారు. ఇరు ప్రాంతాలు ఐకమత్యంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని చెప్పారు. తనకు ఎప్పుడు ఆంధ్ర, తెలంగాణ అన్న ఫీలింగ్ లేదన్నారు. తెలంగాణ ప్రజా సమితిని స్థాపించి నాడు 13 స్థానాలు గెలుచుకున్నామన్నారు.

బిజెపిది వన్ సైడ్ లవ్: గండ్ర

భారతీయ జనతా పార్టీ పైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుది వన్ సైడ్ లవ్ అని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి వరంగల్ జిల్లాలో అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+