టీవీ యాంకర్‌తో దిగ్విజయ్ అఫైర్: త్వరలో పెళ్లి
న్యూఢిల్లీ: కాంగ్రెసు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన విషయాన్ని బయటపెట్టారు. తనకు టీవీ యాంకర్ అమృతా రాయ్ సంబంధం ఉందని ఆయన బుధవారంనాడు అంగీకరించారు. దిగ్విజయ్ సింగ్ భార్య నిరుడు మరణించింది.
అమృతా రాయ్‌తో తాను కలిసి ఉన్న చిత్రాలు ఇంటర్నెట్ ద్వారా బయపడిన నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ ఆ విషయాన్ని అంగీకరించారు. అమృతా రాయ్‌తో సంబంధాన్ని అంగీకరించడంలో తనకేమీ ఇబ్బంది లేదని ఆయన అన్నారు. ఆమె తన భర్తతో విడాకులకు దరఖాస్తు చేసుకుందని ట్వీట్ చేశారు.

భర్తతో అమృతా రాయ్ విడాకులు తీసుకున్న తర్వాత తాము పెళ్లి చేసుకుంటామని చెప్పారు. అయితే, తమ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. తన భర్తతో విడాకులు తీసుకుంటున్న విషయాన్ని అమృతా రాయ్ కూడా ధ్రువీకరించారు. ఆ తర్వాత తాము పెళ్లి చేసుకుంటామని చెప్పారు.
దిగ్విజయ్ సింగ్ భార్య ఆశా సింగ్ (58) చాలా కాలం క్యాన్సర్‌తో బాధపడి న్యూఢిల్లీలోని ఆస్పత్రిలో మరణించారు. లోకసభ ఎన్నికల ఏడవ దశ పోలింగ్ జరుగుతన్న నేపత్యంలో దిగ్విజయ్ సింగ్ అమృతా రాయ్‌తో తన సంబంధాన్ని ధ్రువీకరించారు.












Click it and Unblock the Notifications